అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో జోగి రమేష్,,, జోగి కులాన్ని రెచ్చగొట్టడం దుర్మార్గం,,, జోగి రమేష్ తప్పుచేసి కులాన్ని అడ్డు పెట్టుకోవడం సిగ్గుచేటు,,
అమరావతి రాజధాని పనులు పరుగులు,,
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్లరమేష్,,
అమరావతి ఆగస్ట్ 13.
అగ్రిగోల్డ్ భూముల అంశం పై జోగి రమేష్ కులం పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడటం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్లరమేష్ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జోగి రమేష్ చేసిన భూ అక్రమాలు అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని గత ఐదేళ్లగా రాష్ట్రంలో వైసీపీ నేతలు చేసిన పాపాలు పుట్ట బద్దలైందని ఒక్కొక్కరు జైలుకి వెళ్ళటం ఖాయమని ఆయన అన్నారు అగ్రిగోల్డ్ భూములు కబ్జాలు జరిగాయని జోగి రమేష్ చేసిన పాపాలు ప్రజలందరికీ తెలుసు అని ఆయన అన్నారు తమ పార్టీ ఎవర్ని అక్రమంగా కేసులో ఇరికించదని అందుకు తెలుగుదేశం వ్యతిరేకమని ఆయన తెలిపారు జోగి రమేష్ తెలుగుదేశం పై విమర్శలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు జోగి రమేష్ తప్పు చేసి కులాన్ని అడ్డుపెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కబ్జా చేసి కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని ఆనాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు అగ్రిగోల్డ్ భూములు అవకతవకలు జరిగాయని జోగి రమేష్ తప్పు చేసి కులాన్ని అడ్డు పెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు వైసీపీ నేతలు ప్రతి సారి రెడ్ బుక్కు అని విష ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు నిజంగా రెడ్ బుక్కు తెలిస్తే రాష్ట్రంలో వైసీపీ నేతలు చాలామంది జైలుకు వెళ్ళటం ఖాయమని ఆయన అన్నారు జోగి రమేష్ పై కేసు పెట్టడంతో కులాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారనిఆయన విమర్శించారు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో వైసీపీ పాలనలో బాపట్ల జిల్లా చెరుకుపల్లి కి చెందిన అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి దారుణంగా చంపినప్పుడు జోగి రమేష్ కు కులం గుర్తు రాలేదా ? అని ఆయన ప్రశ్నించారు ఒకరికి ఒక న్యాయం? మరొకరికి మరొక న్యాయమా? అని ఆయన విమర్శించారు మంత్రి పదవి కోసం చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ వెళ్లడం దుర్మార్గమన్నారు చంద్రబాబు ఇంటిపై దాడి కి జోగి రమేష్ ఎందుకు వెళ్లావో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు , “అమరావతి రాజధాని పనులు పరుగులు”. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ అండ కలిసొచ్చే అంశం కానుందని
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల చర్చలు సూపర్ సక్సెస్ అయ్యాయాని అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని
బ్రాండ్ ఏపీ దిశగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అడుగులు వడివడిగా మొదలయ్యాయని అందమైన రాజధానిగా చంద్రబాబు తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారని ఆయన తెలిపారు
అమరావతి రాజధానిని సుందరమైన నగరంగా రూపుదిద్దనుందని కేంద్రం సహకారం
తొలి దశలో 15 వేల కోట్ల రుణ మంజూరుతో అమరావతి రాజధానిలో పనులు ఊపందుకోనున్నాయాని ఆయన తెలిపారు
ఐదేళ్లలో వైసిపి హయాంలో ఒక్క ఇటుక కూడా వేయని ‘జగన్ అండ్ కో’కు ఇదంతా కంటగింపుగా మారిందని
జగన్ చేయలేని పనిని చంద్రబాబు చేస్తుంటే కుడితిలో పడ్డ ఎలుకల్లా జగన్ గింజుకుంటున్నారాని ఆయన విమర్శించారు
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల పర్యటనతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ కే మంచి రోజులు వచ్చినట్లే చంద్రబాబు కు రాష్ట్ర ప్రజలు జై జై లు పలుకుతున్నారని ఆయన తెలిపారు తెలుగు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మూడు నెలలు అడుగుపెట్టిన వేల ప్రజలు మదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయాడని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఈనెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కృష్ణాజిల్లా ఉయ్యూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారని 16వ తేదీన 99 అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో ఆయా ప్రాంతాలలో తెలుగుదేశం ప్రతినిధులు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు
Comments are closed.