The South9
The news is by your side.
after image

స్వార్థ రాజకీయాల కోసం జనసేన – టీడీపీ నీచపు పొత్తులు సీఎం జగన్

 

*తేది: 16-05-2023*

 

 స్వార్థ రాజకీయాల కోసం జనసేన – టీడీపీ నీచపు పొత్తులు..*

*ప్రతిపక్షాల యుద్ధం జగన్ తో జనంతోనే..*

*వచ్చే ఎన్నికల్లో పొత్తులు.. ఎత్తులు, కుయుక్తులనే నమ్ముకున్న బాబు, దత్తపుత్రుడు*

*సీఎం పదవి వద్దంట, ప్యాకెజీ ఇస్తే చాలంట.. ఒక్క సీటు కూడా గెలవక ముందే.. కుట్రలు మొదలు*

*వైయస్ఆర్ మత్య్సకార భరోసా నిదుల విడుదల సభలో సీఎం జగన్*

Post midle

*1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లోకి రూ.123.52 కోట్లు జమ*

 

నిజాంపట్నం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పొత్తులు, కుట్ర రాజకీయాలపై విరుచుకుపడ్డారు అధికారంపై కాంక్షతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, తన దత్తపుత్రుడు పొత్తులు, ఎత్తులు, కూయుక్తలతో దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐలతో కలసిపోయి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పంది బాబు, పవన్ అని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదని.. ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని అన్నారు. పేదలకు మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని ప్రశ్నించారు.

 

నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మ‌త్స్య‌కార భ‌రోసా సాయాన్ని జమచేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున‌ మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జమచేశారు. ఇప్పటి వరకు రూ. 538 కోట్ల సాయం అందజేత.

 

 

*వెంటిలేటర్ పై బాబు పార్టీ*

 

చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం పోతే జూబ్లీహిల్స్ ఉంటాడని సీఎం జగన్ దుయ్యబట్టారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్లో ఉండటం వీరి పని అని మండిపడ్డారు. అయితే ఏపీలోనే తన శాశ్వత నివాసం ఉందని.. తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషికి ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని, ఆయన పార్టీ వెంటిలేటర్పై ఉందని ఎద్దేవా చేశారు.

 

 

Post Inner vinod found

*చంద్రబాబు చెప్తే ప్యాకెజీ స్టార్ చిత్తం ప్రభు అని అంటారు*

 

చంద్రబాబుకు ఏది మంచి జరిగితే అదే చేస్తానంటాడు దత్తపుత్రుడు. ఏ పార్టీని కలవాలో దత్తపుత్రుడికి చంద్రాబాబే చెప్తాడు. బాబు చెప్తే దత్తపుత్రుడు బీజేపీ పక్కన చేరతాడు. చంద్రబాబు బీజేపీకి విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 గజదొంగల ముఠా సభ్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు చక్రం తిప్పుతున్నారని రాస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలుపని పండుగా చేసుకుంటారు. కర్ణాటకలో ఓడిన బీజేపీని తమతో కలిసి రావాలని వీళ్లే కోరతారు. వీరు చేస్తుంది జగన్ తో యుద్ధం కాదు జనంతో యుద్ధం. వీరు చేస్తుంది రాజకీయ పోరాటం కాదు.. అధికారం కోసం ఆరాటం. పేదలకు మంచి చేయాలన్న తపన, తాపత్రయం వారికి లేదు.

 

*సీఎం పదవి వద్దంట, ప్యాకజీ ఇస్తే చాలంట*

 

‘రెండు చోట్ల పోటీచేస్తే.. మాకు ఎమ్మెల్యేగా వద్దని రెండు చోట్లా దత్తపుత్రుడని ప్రజలు ఓడించే పరిస్థితి చూశాం. 10 ఏళ్లుగా రాజకీయ పార్టీ పెట్టిన దత్తపుత్రుడు 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. నాకు సీఎం పదవి వద్దు.. దోపిడీలో వాటా చాలని దత్తపుత్రుడు అంటున్నాడు. గజదొంగల ముఠాగా దోచుకోవడానికి వీరంతా కలుస్తున్నారు. వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలి.

 

*పొత్తులు పెట్టుకుని వివాహం చేసుకునేది వీళ్లే, విడాకులు ఇచ్చేది వీరే*

 

ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా.. మంచి చేస్తున్నా. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తో నిలవండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి, రాష్ట్రపతిని కలిస్తే చాలు నా పై దుష్పచారం చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్తో అంటకాగిన వాళ్లు నన్ను దూషిస్తున్నారని విమర్శించారు. పొత్తులు పెట్టుకుని వివాహం చేసుకునేది వీళ్లేనని, విడాకులు ఇచ్చేది కూడా వీరేనని దుయ్యబట్టారు. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకునేది వీళ్లేనని, మ్యచ్ ఫిక్సింగ్ కూడా వీళ్లదేనని మండిపడ్డారు.

 

*మత్య్స, ఆక్వారంగాలకు మంచి జరిగేలా కార్యక్రమాలు..*

 

జగనన్న ఇస్తున్న పథకాల ద్వారా లబ్ధిదారుల సంఖ్య 55% పెరిగింది. గత ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే..ఇప్పుడు రూ.9 ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. గతంలో 1100 బోట్లకు సబ్సిడీ ఇస్తే..ఇప్పుడు 20 వేల బోట్లకు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం అందేదని గత ప్రభుత్వంలో ముష్టి వేసినట్లు రూ. 4 వేలు కొంత మందికే ఇచ్చేవారని చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమేనని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు చంద్రబాబు పెట్టిన రూ.451 కోట్లతో కలిపి రూ.2792 కోట్లు విద్యుత్‌ సబ్సిడీ చెల్లించినట్లు తెలిపారు. గోదావరి జిల్లాలో ఫిషరీష్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మత్స్యకారుల వలసలు లేకుండా కొత్తగా 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, 4 పోర్టుల నిర్మిస్తున్మామని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1.50కే ఇచ్చామని తెలిపారు.

 

*తేడా గమనించండి*

 

గతంలో పాలన చేసిన వారు, ఆ పాలకులకు మద్దతు ఇస్తున్న వారు పేదవారికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ప్రభుత్వానికి కేవలం తేడా గమనించమని కోరారు.

 

*నేటి శంకుస్థాపనలు*

 

కాగా నేడు దిండి గ్రామంలో 280 ఎకరాల ప్రభుత్వ భూమిలో 185 కోట్లుతో వ్యయంతో నిర్మించబోతున్న ఆక్వా పార్క్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 21వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని తెలిపారు. రూ. 417 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఓడరేవు ఫిషింగ్ హార్బర్ కూడా నేడు సీఎం శంకుస్థాపన చేశారు.

Post midle

Comments are closed.