*గ్రామాల అభివృద్దికి జగనన్న పెద్దపీట : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: రామస్వామిపల్లిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే*
*: సచివాలయం పరిధిలో రూ.11.31 కోట్లతో అభివృద్ది, సంక్షేమం*
రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
సోమవారం ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి సచివాలయం పరిధిలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి పూజా కార్యక్రమాలను నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఏర్పాటు చేసిన సచివాలయ సేవలు, రైతులకు అవసరమైన అన్ని అవసరాలను తీర్చే విధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగనన్న ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, పక్క రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ రాష్ట్రంలో ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు.
అనంతరం రామస్వామిపల్లి సచివాలయం పరిధిలోని బంట్లపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు.
పలువురు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన రామస్వామిపల్లి, బంటపల్లి నుంచి డీసీపల్లి వరకు సిమెంటు రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించి ఉన్నామని, త్వరలోనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 93 సచివాలయాలు ఉండగా ఇప్పటి వరకు 81 సచివాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను నేరుగా కలిసి వారికి సంక్షేమ పథకాలను వివరించడం జరిగిందని అన్నారు.
ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలతో అభివృద్ది, సంక్షేమ పథకాల రూపంలో అందచేశారని, రామస్వామిపల్లి సచివాలయం పరిధిలో రూ.11.31 కోట్ల రూపాయలను అందచేశారని వివరించారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయనకు తోడుగా ప్రజలందరూ నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే రెవెన్యూ, హౌసింగ్ పై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి, పనుల వేగవంతానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం ఇప్పటికే రెండు జాబ్ మేళాలు నిర్వహించామని, నవంబర్ 2న ఆత్మకూరు ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంగా 2వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Comments are closed.