The South9
The news is by your side.
after image

జగనన్నే సూపర్ హీరో : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

*జగనన్నే సూపర్ హీరో : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: యువగళం ప్లాప్ షో*

*: ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు*

*: ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు*

*: రక్తదానం చేసిన ఎమ్మెల్యే మేకపాటి*

*: రూ.12.80 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ*

*: నీలాయపాళెం దేవాలయానికి రూ.50లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే*

Post midle

*: విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ*

*: ఆరోగ్యశ్రీ కార్డులతో ఆరోగ్య భద్రత*

 

👉రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికి సూపర్ హీరో అని, ప్రతిపక్షాలు నిర్వహించే ప్లాప్ షోలతో ప్రజలు విసిగిపోయారని, అసలు వారిని నమ్మే స్థితిలో లేరని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

 

👉గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

👉సీయం జన్మదినోత్సవం సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంకు వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రక్తదానం చేశారు. ఆయనతో పాటు భారీగా నాయకులు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రక్తదాన శిబిర నిర్వాహకులను, రక్తదాతలను అభినందించారు.

Post Inner vinod found

👉అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించి అందులో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని అన్నారు.

 

👉విద్యా వ్యవస్థను అభివృద్ది చేసేందుకు ఐదేళ్ల కాలంలో రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశారని, స్కూల్ డ్రాప్ అవుట్స్ 34 శాతం ఉన్నది జగనన్న అభివృద్ది పనులతో 9 శాతానికి పడిపోయిందని, జగనన్న విద్యా వ్యవస్థలో చేసిన సంస్కరణలు దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని వివరించారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకే ట్యాబ్ లు అందచేయడం జరుగుతుందని. వారి భవిష్యత్తుకు జగనన్న భరోసా ఇస్తున్నారని అన్నారు.

 

👉వైద్య వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలతో ప్రతి ఇంటికి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆరోగ్యశ్రీ పరిధిని మించి అందిరకి వైద్యసేవలు అందించారని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వాటికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసహాయం అందచేశారన్నారు. నేడు ప్రభుత్వ వైద్యం ఏ స్థాయిలో అభివృద్ది చెందిందో ప్రజలే చెబుతారన్నారు.

 

👉వ్యవసాయాన్ని పండుగ చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా వచ్చిన జగనన్న ఎన్నో సంస్కరణలు తీసుకురావడంతో దేశంలో వ్యవసాయ రంగంలో 28 స్థానంలో ఉన్న రాష్ట్రంలో 4వ స్థానానికి వచ్చిందని, రూ.33 వేల కోట్లు రైతు భరోసా కింద రైతులకు అందచేసి వారిని ఆర్థికంగా అభివృద్ది చేశారన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రుణమాఫీని కూడా అమలు చేయకుండా రైతులను మోసం చేశారని, జగనన్న ఇచ్చిన మాట తప్పకుండా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.

 

👉సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు పొత్తులు కలుపుకుంటూపోతూ ఆయనను ఎదురించాలని చూస్తున్నారని, యువగళం ప్లాప్ షోలా మారిందని, మరో కొత్త హీరోను తీసుకొచ్చి షో ప్రారంభిస్తామని అంటున్నారని అన్నారు.

 

👉ప్రజలకు ఎలాంటి మంచి చేస్తారో చెప్పకుండా ఒక్క వైఎస్సార్సీపీను దింపడమే అజెండాగా పనిచేసుకుంటూ పోతున్నారని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. యువగళం పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడి కుమారుడు చూసింది జగనన్న సంక్షేమ పథకాలేనని, దీంతో యువగళం పాదయాత్రను ముగించేశారని అన్నారు.

 

👉ఎలా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలంతా జగనన్ననే నమ్ముతున్నారని ఆయన వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని అన్నారు.

 

*రూ.12.80 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేత*

 

👉ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 9 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన రూ.12.80 లక్షల చెక్కలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యక్రమంలో అందచేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని రాని వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

 

*ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ*

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి మరింత కల్పించే విధంగా నూతనంగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మహిమలూరు పీహెచ్ సీ పరిధిలో పలువురికి నూతనంగా మంజరైన ఆరోగ్యశ్రీ కార్డులను ఎమ్మెల్యే మేకపాట విక్రమ్ రెడ్డి సభా ప్రాంగణంపైనే అందచేశారు.

 

ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం నీలాయపాళెం గ్రామంలోని ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దేవాలయ నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. దీంతో మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నీలాయపాళెం గ్రామస్తులకు సభా ప్రాంగణంలో అందచేశారు. ఆధ్యాత్మికత విరాజిల్లే విధంగా నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణాలు సీయం జగన్ మోహన్ రెడ్డి సహకారంతో చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

Post midle

Comments are closed.