The South9
The news is by your side.
after image

అందరి అభ్యున్నతికి జగనన్న కృషి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

అందరి అభ్యున్నతికి జగనన్న కృషి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
ప్రజా సమస్యల ప రిష్కారమే ప్రధాన లక్ష్యం
తరుణవాయిలో గడప గడపకు మన ప్రభుత్వం

ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, అందరి అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.

*మంగళవారం సంగం మండలం తరుణవాయి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఇంటింటికి వెళ్లి గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమల చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.*

*ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ముఖ్యమంత్రి జగనన్నకు ఏం చెప్పామంటారంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పాలనను అందరూ ఆశీర్వదించాలని సూచించారు.*

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామంలో పలువురు ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో రివ్యూ సమావేశం ద్వారా వాటిని అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు.*

Post Inner vinod found

*తాము నిర్వహించిన సర్వేలో సమస్యలను ఇప్పటికే పరిష్కరించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అవసరమైన అభివృద్ది పనులకు ప్రతిపాదనలు సిద్దం చేస్తే నిధులు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు.*

*అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 93 సచివాలయాలు ఉన్నాయని, ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 32 సచివాలయాలను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు.*

Post midle

*తరుణవాయి సచివాలయం పరిధిలో మూడు రోజులు పర్యటిస్తామని, ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.*

*అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు.*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా ఉందని, వైఎస్సార్ చేయూత ద్వారా ఎంతో మంది లబ్దిదారులు వ్యాపారాలు చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.*

*గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించి గ్రామాలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.*

Post midle

Comments are closed.