జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు: జగనన్న ఆరోగ్య సురక్ష సమీక్ష కార్యక్రమంలో సీఎం.
తేది: 06-11-2023*
*స్థలం: తాడేపల్లి*
*జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు: జగనన్న ఆరోగ్య సురక్ష సమీక్ష కార్యక్రమంలో సీఎం*
*అర్బన్ లో 91 శాతం, రూరల్ లో 94శాతం ఆరోగ్య సురక్ష స్క్రీనింగ్ పూర్తి*
*85వేల మందిని తదుపరి చికిత్స కోసం చర్యలు.. డిసెంబర్ నెలాఖరుకి చికిత్స కూడా పూర్తైలా ప్రణాళిక.. పేషేంట్ ప్రయాణ ఖర్చుకు రూ.500లు*
*ప్రివెంటివ్ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్‌లు అత్యంత కీలకం*
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ ఎం గిరిజాశంకర్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ( కోవిడ్ –19) కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనదని, వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందని, 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని పేర్కొన్నారు.
శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు చూయూత నివ్వడం చాలా ముఖ్యమని, జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావని, శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందని, శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అన్నది అత్యంత ముఖ్యమైనదని, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంతవరకూ మనం చేదోడుగా నిలుస్తామని సీఎం అన్నారు.
మొదటగా ప్రతి ఇంటికీ వెళ్లి, జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించామని, ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోందని, అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యిందని, 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేసి, 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారని సీఎం వివరించారు.
ఇప్పుడు మనం జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నామని, క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని, ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై మన దగ్గర డేటా ఉందని చెప్పారు.
*85వేల మందిని తదుపరి చికిత్స కోసం చర్యలు తీసుకుంటున్నాము*
జగనన్న సురక్ష క్యాంపుల్లో నవంబర్ 5 నాటికి 85వేల మంది పేషెంట్లను తదుపరి చికిత్సలకోసం నెట్వర్క్ ఆస్పత్రి లేదా టీచింగ్ ఆస్పత్రులకు రిఫర్ చేశారని, వీరికి చేయూత నివ్వడం ఒక కార్యక్రమమని అధికారులకు సీఎం సూచించారు. మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్ చేయాలని, ఆతర్వాత విలేజ్ క్లినిక్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు, గ్రామ సచివాలయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించాలని, వారి ద్వారా వీరికి నయం అయ్యేంతవరకూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని,
13,850 కేసులను ఇప్పటివరకూ చేయూత నిచ్చి వారిని తదుపరి చికిత్సలకోసం ఆస్పత్రులకు పంపించడం జరిగిందని తెలిపారు.
*పేషేంట్ ప్రయాణ ఖర్చుకు రూ.500లు: సీఎం*
మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని, వారికి కావాల్సిన మందులు ఇచ్చి, వారికి నయం అయ్యేంత వరకూ కూడా తగిన విధంగా చేయూత నివ్వాలని, మిగిలిన ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి గుర్తించిన మొత్తం రిఫరెల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమం డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. వీరు చికిత్సలు చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వారికి కావాల్సిన మందులు అందించడంతోపాటు, వారు వేసుకునేలా తగిన విధంగా చేయూత నివ్వాలని సూచించారు. రిఫరల్ ఆస్పత్రులకు వెళ్లేందుకు ఈ పేషెంట్లకు రూ.500లు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలని, ఒకవేళ ఆరోగ్య శ్రీ ప్రొసీజర్‌లో కవర్ కాని కేసులు అక్కడక్కడా ఉండొచ్చని, ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్య శ్రీకింద ఉచితంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తారని, ప్రతి నెలా మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక చేస్తున్నామని, ఆరోగ్య శ్రీ కింద నమోదుకాని రోగాలు ఏమైనా కనిపించినా, ప్రత్యేక కేసుల కింద పరిగణించి వారికి ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు అందిస్తామని, ఈ పేషెంట్లను గుర్తించి, వారికి చికిత్సలు అందించే బాధ్యతను మనమే తీసుకోవాలని ఆధికారులకు సీఎం సూచించారు.
ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు చేయించుకున్న పేషెంట్లపై దృష్టిపెట్టడం అన్నది మరొక విషయమని, చికిత్సలు చేయించుకున్న తర్వాత వీరికి అందిన వైద్యంపై పూర్తి వివరాలు కనుక్కోవాలని, ఎలాంటి లంచాలకు తావులేకుండా ఉచితంగా వైద్యం అందిందా? లేదా? అన్నది తెలుసుకోవాలని, వారు మందులు తీసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలని, ఆరోగ్య శ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారని సీఎం తెలిపారు. క్రమం తప్పకుండా తిరిగి వీళ్లు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, పేషెంట్లకు తెలియక, సరైన అవగాహన లేక తదితర కారణాల వల్ల చికిత్సలు చేయించుకున్న రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకోని సందర్బాలు చూస్తున్నామని, ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదని, నిర్ణీత సమయానికి పేషెంట్లు వెళ్లి మందులు తీసుకునేలా చూడాలని, ఈమేరకు యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకురావడం జరిగిందని, పేషెంట్లు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు ఉందని, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల కింద గుర్తించిన పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు.
*డిసెంబర్ నెలాఖారికి అందరికి ఆరోగ్యం*
ఈ క్యాంపులు ద్వారా ఇప్పటివరకు 8.7 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారని, 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారని, వీరికి వెంటనే కంటి అద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే 73 వేలమందికి పైగా కంటి సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారని, వీరికి కూడా వెంటనే సర్జరీలు చేయించేలా చూడాలని,
డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీకూడా పూర్తికావాలని సీఎం ఆదేశించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్టుగా గుర్తించిన వారికి తదుపరి నిర్ధారణ పరీక్షలు చేయించాలని, అందులోకూడా నిర్ధారణ అయిన తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని,
ప్రివెంటివ్ కేర్‌లో ఇది కీలక అంశమని, వీరికి చేయూత నందించాలని తెలిపారు.
అలాగే 9,969 మందికి లెప్రసీ అనుమానాస్పద కేసులు ఉన్నాయని, వీరికి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, అలాగే 442 మందికి టీబీ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యిందని, 1239 మంది చిన్నారులు 4-D సమస్యలతో బాధపడుతున్నట్టుగా తేలిందని, వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలని,కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందించడం వల్ల ఆ పిల్లలు ఈ సమస్యలనుంచి బయటపడతారని సూచించారు.
*ఇప్పటికి బాధపడుతున్నావారి పై మరింత శ్రద్ధ తీసుకోవాలి*
ఒక మూడోది ఇప్పటికే తీవ్రరోగాలతో బాధపడుతున్న వారికి తగిన రీతిలో చేయూత నందించాలని, ఈ మందులు ఖరీదైనవి కాబట్టి, వాళ్లు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని, అలాంటి వారికి కూడా మందులు అందించాలని, మందులు ఎంత ఖరీదైనా సరే, పేషెంట్లకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌తో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించనున్నాయని, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చురుగ్గా సాగుతోందని, ప్రతి జిల్లాలో కూడా అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుందని, ఉన్న మెడికల్ కాలేజీలను కూడా పునరుద్ధరిస్తున్నామని సీఎం అన్నారు.
*ఎక్కడ ఖాళీలు ఉన్న వెంటనే భర్తీ చేయాలి*
రిక్రూట్మెంట్ పాలసీమీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలని, ఎక్కడైనా స్పెషలిస్టులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలని, ఇప్పటికే 53 వేలమందిని ఆరోగ్య రంగంలో ఖాళీలను మనం భర్తీచేశామని, ఎక్కడ ఖాళీలు ఉన్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, మెడికల్ రిక్రూట్ బోర్డును సృష్టించడం జరిగిందని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
*ప్రివెంటివ్ కేర్‌లో జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్‌లు అత్యంత కీలకం*
పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలని, ఈ సమస్యలతో బాధపడుతున్నవారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందుతుందా, వారికి మందులు అందుతున్నాయా అన్న విషయాన్ని విలేజ్ క్లినిక్ ద్వారా పరిశీలన చేయించాలని తెలిపారు. లక్ష్యాలను సాధించడానికి దేశంలో ఏ రాష్ట్రాంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉందని వెల్లడించారు. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెస్ట్, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థ మనకు ఉందని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థలు లేవని ఉద్ఘాటించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయని, కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తామని అన్నారు.
*జనవరి 1 నుంచి క్రమంత తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు*
జనవరి 1 నుంచి క్రమంత తప్పకుండా ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని, ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుందని, దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయని, ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యతని సూచించారు.
*నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఆరోగ్యశ్రీ పై అవగాహన కార్యక్రమం*
అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలని, మంచి ఫీచర్లతో ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చానని అన్నారు. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని, ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలని, ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలని, దిశ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలని సూచించారు. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయని, దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదని, యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుందని, లేకపోతే విలేజ్ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్ చేస్తారని, ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్లెట్స్ కూడా ప్రతి కుటుంబానినీ అందిస్తారని తెలిపారు
2,295 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని, అయినా వైద్యంకోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లోనుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మన అందరి బాధ్యత అని సూచించారు.
Comments are closed.