విశాఖ కేంద్రంగా గేరు మార్చిన కూటమి ప్రభుత్వం
సౌత్ 9 : ప్రతినిధి
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఒకే చోట పాలన,అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్ములాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వము విశాఖ రాజధాని అనే నిర్ణయానికి మద్దతు లభించలేదు. ఇప్పుడు అమరావతి రాజధానిగా నిర్మాణానికి అడుగులు వేస్తున్న ప్రభుత్వం విశాఖ కేంద్రంగా తమ విధానం స్పష్టం చేయడానికి సిద్ధమైంది. మంత్రివర్గ సమావేశంలో విశాఖను ఆర్థిక రాజధానిగా ఆమోదముద్ర వేస్తూ మరో 22 పాలసీల ప్రకటనకు సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రం ప్రకటనకు సిద్ధమవుతోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించే నిర్ణయం తీసుకొని ఉంది. కూటమి నేతలు చాలా రోజులుగా విశాఖను ఆర్థిక రాజధానిగా కొనసాగిస్తామని చెబుతూ వచ్చారు. అమరావతి పరిపాలన రాజధానిగా కర్నూల్ లో హైకోర్టు బెంచ్ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అధికారికంగా ఖరారు చేయాలని నిర్ణయించింది వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసేందుకు కసరత్తు చేస్తుంది అదే సమయంలో పాలన సంస్కరణలో భాగంగా ఇప్పటికే నూతన ఇసుక పాలసీ మద్యం విధానాలను ప్రకటించిన ప్రభుత్వం మరో 22 కొత్త పాలసీలను తీసుకొచ్చేలా కార్యాచరణ చేపట్టింది ఇంధన రంగానికి సంబంధించిన విధానం రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై చంద్రబాబు ఇప్పటికే అధికారులతో సమీక్షించారు.పర్యాటక, పారిశ్రామిక, ఐటీ వంటి రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను ఖరారు చేయనుంది. ఆర్థిక సమస్యలు ఉండడంతో ముందుగా ఆర్థికేతర అంశాల పరిష్కారం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీల పైన సి ఎస్ అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వం పాలనాపరంగా కొత్త మార్పులు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ముందుగా ఇంధన రంగం, ఉన్నత విద్య, బ్లూ ఓషన్ ఎకానమీ, మారీ టైం, టెక్స్టైల్ 500 కంపెనీల పై ప్రత్యేక దృష్టి పెడుతూ నూతన పారిశ్రామిక విధానం, పారిశ్రామిక పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ హార్డ్వేర్, అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటి, రహదారులు, పర్యాటకం యువత, వాటర్ పాలసీ లతోపాటు పలు ఇతర రంగాలకు సంబంధించిన పాలసీలను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Comments are closed.