న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ట్విట్టర్ సంస్థ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ను అడ్డుకోవడమే అని అన్నారు. ట్విట్టర్ వైఖరికి నిరసనగా ముందుకు వెళ్లాలని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యదర్శుల భేటీలో కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ కి తలొగ్గి ట్విట్టర్ సంస్థ ద్వంద ప్రమాణాలను పాటిస్తుందని దుయ్యబట్టారు. 4 రోజుల క్రితం ఢిల్లీలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను రాహుల్ గాంధీ పరామర్శించారు . దానికి సంబంధించిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వివాదం రేగింది. ఆ ఫోటోను ట్విట్టర్ సంస్థ తొలగించడంతో పాటు తాత్కాలికంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ను సస్పెండ్ చేయడంతో ట్విట్టర్ సంస్థ వైఖరి పై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
Comments are closed.