శృతిహాసన్ తప్పుకుందా? తప్పించారా?
south9: ప్రతినిధి
డిఫరెంట్ కాన్సెప్ట్స్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేషు. చాలా తక్కువ బడ్జెట్ తో వేగంగా సినిమాలు తీస్తూ అంతే స్థాయిలో సక్సెస్ అందుకునే యాక్టర్ అడవి శేషు. ప్రస్తుతం అడవి శేషు డెకాయిట్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డెకాయిట్ మూవీ నుంచి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి మేజర్ మూవీ సక్సెస్ తరువాత అడవి శేషు ఆ స్పీడ్ చాలా తగ్గించారు. 2022లో గూడచారి,మేజర్ అనే రెండు సినిమాలతో వచ్చిన అడివి శేషు గతేడాది ఒక్క మూవీ కూడా విడుదల చేయలేదు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి వచ్చే ఏడాది మూడు సినిమాలను విడుదల చేయబోతున్నారు. గూడచారి టు, డెకాయిట్ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గూడచారి మూవీ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా గూడచారి 2 రూపొందిస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే శృతిహాసన్ అడవి శేషు హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న మూవీ డెకాయిట్. క్షణం గూడచారి సినిమా లకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా మారారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పైగా కంప్లీట్ అయింది. అయితే ఈ మూవీ నుంచి హీరోయిన్ గా శృతిహాసన్ తప్పుకుందంటూ ఓ వార్త వస్తుంది. డేట్ ఇష్యూ కారణంగా శృతిహాసన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోవడంతో శృతిహాసన్ తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శృతిహాసన్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీలో కూడా లీడ్ రోల్ చేస్తోంది. అలాగే చెన్నై స్టోరీస్ అనే మూవీ లో కూడా శృతిహాసన్ నటిస్తోంది.దాంతో డెకాయిట్ మూవీ నుంచి శృతిని తప్పించారా? లేక ఆమే తప్పుకుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ఇదే నిజమైతే ఈ చిత్రానికి మరింత బడ్జెట్ సమయం కేటాయించాల్సి వస్తుంది.
Comments are closed.