అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్టు అప్రజాస్వామిక చర్య అని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడమేకాకుండా థర్డ్‌డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని ,రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలుచేయాల్సిన పోలీసులు జగన్‌రెడ్డి పార్టీ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారు అని అన్నారు . ఆంధ్రాలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తోన్న జగన్‌రెడ్డి రాక్షసపాలనలో ఒక ఎంపీని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకే ఈ దుస్థితి అయితే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షం, ప్రజలకి ఇంకెక్కడి రక్షణ? ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయి. ఏపీలో అరాచకపాలనపై ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, రాష్ట్ర గవర్నర్ సత్వరమే స్పందించాలి. కేంద్రబృందాలతో న్యాయవిచారణ జరిపించాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని లోకేష్ కోరారు.
నర్సాపురం ఎంపీ @RaghuRaju_MP ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలుచేయాల్సిన పోలీసులు @ysjagan పార్టీ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారు.(1/4)#WeAreWithRRR pic.twitter.com/dqfQajHPyY
— Lokesh Nara (@naralokesh) May 15, 2021
Comments are closed.