అమరావతి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు, స్కానింగ్ ల కు డబ్బులు ఎక్కువ వసూలు చేయడం, వంటి ఆరోపణలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పడిన 18 ఫ్లయింగ్ స్క్వాడ్లు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల బృందంలో జిల్లాస్థాయి విజిలెన్స్ అధికారులు, వైద్యాధికారులు ఔషధ నియంత్రణ అధికారులు, కలిసి తనిఖీలు నిర్వహించారు . హాస్పిటల్స్ లో ఆక్సిజన్,
రెమిడీ సివర్, కరోనా మందులు. నిల్వలు. ఎంత వరకు పంపిణీ చేశారనేది క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా తిరుపతి రమాదేవి మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ రోగులు నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అలానే ఒంగోలులోని ప్రకాశం హాస్పిటల్ అవసరానికి మించి రోగులు పేరుతో రెమిడి సివర్ ఇంజక్షన్ తీసుకున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రైవేట్ హాస్పిటల్స్ సేవలు అందించాలని ఆ యాజమాన్యాలకు ఈ సందర్భంగా సూచించారు.
Comments are closed.