అమరావతి.
వినూత్నంగా మార్కెట్లు ..వైవిధ్యంగా ఎగుమతులు : పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఎగుమతులలో దూసుకెళ్తాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
పెట్టుబడులు, వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధిలో అగ్రస్థానమే లక్ష్యం
వృద్ధి, ఉద్యోగాలు, నైపుణ్యం, ఈక్విటీల భాగస్వామ్యంతో సరికొత్త మార్గంలో ఎకనమి రికవరీ దిశగా సాగుతాం
ఇండియా జీడీపీలో ఎగుమతుల వాటా 20 శాతం , ఆంధ్రప్రదేశ్ జీఎస్ డీపీలో ఎగుమతుల వాటా 12 శాతం
2025 కల్లా 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది
ఆ లక్ష్యాన్ని చేరాలంటే 36 శాతం ఎగుమతులు పెరగాలి
భారత దేశ ఎగుమతులలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాటా 5 – 6 శాతం(16.8 బిలియన్ డాలర్లు)
ఈ గ్రోత్ రేట్ తో ఏపీ 22.4 బిలియన్ల విలువైన సరకు రవాణా చేసి, భారత్ 2025 ఎగుమతుల లక్ష్యంలో 2.2 శాతం భాగస్వామ్యమవనుంది
ఆంధ్రప్రదేశ్ 2030 లక్ష్యం : మంత్రి గౌతమ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన వృద్ధిలో ఎగుమతుల రంగానిదే కీలక పాత్ర
2030 కల్లా రెట్టింపు ఎగుమతులు సాధించడానికి ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లనుంది
ప్రతి ఏడాది 8 శాతం వద్ధి రేటు సాధిస్తే ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని ఛేదించడం సులభం
అందుకు స్టేక్ హోల్డర్లు భాగస్వామ్యం, స్పష్టమైన ప్రణాళిక అవసరం
ఎగుమతులతో పారిశ్రామికాభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలకు కావలసిన సదుపాయాలు, అద్భుతమైన లాజిస్టిక్ నెట్ వర్క్, అత్యాధునిక ప్రమాణాలు, అద్భుతమైన నైపుణ్యం కలిగిన మానవవనరులు, పారదర్శకతతో కూడిన మంచి పరిపాలన ముఖ్యం
ప్రపంచంతో పోటీ పడే లక్ష్యంలో భాగంగా 10 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశాం, ప్రతి 2,3 ఏళ్లకోసారి సమీక్షించుకుంటూ లక్ష్యం దిశగా సాగుతాం
ఎగుమతులకు మరింత మేలు చేసేలా సింగిల్ డెస్క్ పోర్టల్ : మంత్రి మేకపాటి
అత్యున్నత ప్రమాణాలు, వసతులతో గిడ్డంగులను ఏర్పాటు చేసి , సరకు రవాణా చేసి, ఎగుమతుల సామర్థ్యం మరింత పెంచుతాం
ప్రస్తుతం ఏపీలోని గిడ్డంగులలో 181 మిలియన్ మెట్రిక్ టన్నులున్న నిల్వ సామర్థ్యాన్ని 2024-25కల్లా 560 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచుతాం
సరకు రవాణాలో సరికొత్త పద్ధతులను అవలంభించనున్నాం
ఎగుమతుల రెట్టింపులో ‘చౌక రవాణా’ మేం ఎంచుకున్న మార్గం
రంగాలవారీగా జిల్లా స్థాయిలో ఎగుమతులకు సంబంధించిన పర్యవేక్షణ పెంచుతాం
డిమాండ్ ఉన్న వస్తువులలో మన బలాన్ని పెంచుకుంటాం
గ్లోబల్ ట్రెండ్స్, పారిశ్రామికవేత్తల ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుంటాం
స్థానికంగా ఉండే వనరులలో సామర్థ్యం పుంజుకునేలా చేస్తాం
వినూత్న పద్ధతులలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య ఒప్పందాలను అందిపుచ్చుకుంటాం
మా గమ్యాన్ని చేరడానికి , నాణ్యతతో కూడిన సరకు రవాణా సంబంధిత అంశాలలో ఇండియన్ మిషన్స్, ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ లు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా
ఒక జిల్లా ఒక వస్తువు, ఎక్స్ పోర్ట్ హబ్ లుగా జిల్లాలు, డిస్ట్రిక్ట్ హాట్స్ వంటి కార్యక్రమాలతో ఎగుమతులను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం
సరకు రవాణా ఖర్చు తగ్గించడంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చొరవతో గుంతకల్ డివిజన్ నుంచి చిత్తూరు జిల్లా కేంద్రంగా చక్కెర లోడింగ్ ప్రారంభమైంది
వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులకోసం ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను ఏర్పాటు చేశాం
ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపార మాల ఎక్స్ ప్రెస్ లైన్ ద్వారా మామిడి పండ్లను రవాణా చేస్తున్నాం
ఏపీ నుంచి ఎమ్ఎస్ఎమ్ఈలు, ఎగుమతిదారులు చూపిన చొరవకు నా అభినందనలు
కరోనా విపత్తులో యావత్ ప్రపంచం తిరోగమనంలోకి వెళ్తున్నా మన ఎగుమతులు, ఉత్పత్తుల రవాణా, నాణ్యత , విశ్వసనీయతలో చెక్కు చెదరలేదు
Comments are closed.