ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ పరిశ్రమ ప్రతినిధులు
తేదీ: 17-12-2022,
అమరావతి.
*ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ పరిశ్రమ ప్రతినిధులు*
*బీఈఎల్ పరిశ్రమ ఏర్పాటు కోసం బోర్డులో నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం*
*పారిశ్రామికవేత్తల పట్ల ముఖ్యమంత్రి స్నేహపూర్వక శైలికిది నిదర్శనమని ఛైర్మన్ వెల్లడి*
*ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ.384 కోట్లు మంజూరు చేస్తూ బీఈఎల్ బోర్డు నిర్ణయం*
ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డితో ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ పరిశ్రమ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.డీపీఆర్ సహా ఏపీఐఐసీ నియమావళిని అనుసరించి పరిశ్రమ ఏర్పాటులో కలిగిన జాప్యానికి గల కారణాలను సమర్పించిన బీఈఎల్ కు గత బోర్డు సమావేశంలో ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. బీఈఎల్ పరిశ్రమ ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో అనంతపురం ప్రాజెక్టును వేగంగా అభివృద్ధి చేసే దిశగా రూ.384 కోట్లు మంజూరు చేసిందని సంబంధిత ప్రతినిధులు ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 2016లో అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద బీఈఎల్ ఆధ్వర్యంలో రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ , రక్షణ రంగ ఉత్పత్తుల (మిస్సైల్ మానుఫాక్చరింగ్) యూనిట్ కోసం ఏపీఐఐసీ 914 ఎకరాల భూములను కేటాయించింది.గత ప్రభుత్వంలో అనుమతుల విషయంలో జరిగిన జాప్యాన్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పారిశ్రామికవేత్తల పట్ల స్నేహపూర్వక స్వభావానికి నిదర్శనమి ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ అనుమతులు సహా అన్ని అనుమతులు వేగంగా ఈ ప్రభుత్వంలోనే వచ్చాయన్నారు. ఈవోటీ పెనాలిటీని కూడా రద్దు చేయడం ద్వారా బీఈఎల్ త్వరితగతిన అందుబాటులోకి రావడం వల్ల వెనకబడిన రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందించాలనేదే ప్రభుత్వ అంతిమ ధ్యేయంగా ఛైర్మన్ పేర్కొన్నారు.
మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శనివారం జరిగిన బీఈఎల్ సమావేశంలో ఏపీఐఐసీ బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్,మనోజ్ జైన్ , భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారధి, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
————
Comments are closed.