ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలతో మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై పరిశ్రమల శాఖ ఖండన
*ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలతో మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై పరిశ్రమల శాఖ ఖండన*
తేదీ: 02-11-2022,
అమరావతి.
*రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా అబద్ధం. 17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పడం కూడా నిరాధారం.*
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి దిశగా వాణిజ్య సంస్కరణలను అమలు చేస్తూ క్రియాశీలకంగా అడుగులేస్తోంది.
ప్రభుత్వం ఏపీకి తరలివస్తోన్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశ్రమలు స్థాపనలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టుబడుల ప్రవాహం పరుగులు పెడుతోంది.
జూన్, 2019 నాటి నుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ కి 107 మెగా పరిశ్రమలు వచ్చాయి. వీటి ద్వారా రూ. 46,002 కోట్ల పెట్టుబడులు ఏపీకి రావడం జరిగింది.
మునుపెన్నడూ లేని స్థాయిలో ఎమ్ఎస్ఎమ్ఈలు రెట్టింపు స్థాయిలో ఏపీలో స్థాపించబడ్డాయి.
గత మూడున్నరేళ్ళ కాలంలో మొత్తం 1,06,249 ఎమ్ఎస్ఎమ్ఈలు ఏపీకి రావడం ద్వారా రాష్ట్రానికి రూ.14,656 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7,22,092 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
మరో 57 మెగా పరిశ్రమలు పైప్ లైన్ లో ఉన్నాయి. వీటి ద్వారా భవిష్యత్ లో రూ.91,243.13 కోట్ల పెట్టుబడులు, 1,09,307 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
మరో నాలుగు భారీ పీఎస్ యూ పరిశ్రమల ద్వారా కూడా రూ. 1,06,800 కోట్ల పెట్టుబడులతో పాటు, 79,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు) ద్వారా రూ.1,73,021.55 కోట్ల పెట్టుబడులు, 1,38,403 మందికి ఉద్యోగాలందించే 45 లార్జ్, మెగా పరిశ్రమలకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలందించనున్నాం.
కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ వెళ్లిపోయాయని వచ్చిన వార్తలు కూడా అబద్ధం. శ్రీ సత్యసాయి జిల్లాలోనే కియా అనుబంధ పరిశ్రమలన్నీ కొలువుదీరాయి. కియా పరిశ్రమ అదనంగా రూ.400 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది.
అదానీ డేటా సెంటర్ కోసం విశాఖపట్నంలో ప్రభుత్వం వారు కోరుకున్నట్లే భూములను కేటాయించింది.త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశాఖపట్నం మధురవాడలో శంకుస్థాపన జరగనున్న అదానీ డేటా సెంటర్ (ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ లేదా బిజినెస్ పార్క్) ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులు, 24,990 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అన్నట్లు విశాఖ రుషికొండ ఐ.టీ సెజ్ నుంచి ఏ కంపెనీ తరలిపోలేదు.
లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు ప్రభుత్వానికి చెందిన రూ. వేలకోట్ల విలువైన భూములను తీసుకుని నిర్దేశించిన గడువులోగా ఆ ప్రాజెక్టు పనులు చేపట్టకపోగా ఆ భూములను నిరుపయోగంగా ఉంచడం జరిగింది. ఒప్పందం అతిక్రమించి ప్రతిపాదించిన ప్రాజెక్టును అమలు చేయని ఆ కారణంగా నిబంధనల ప్రకారమే ప్రభుత్వం ఆ భూములను వెనక్కు తీసుకుంది. ఈ కారణాలతోనే లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలతో ఒప్పందాలు రద్దయ్యాయి.
ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావలసిన ఏషియన్ పల్స్ పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఒప్పందం చేసుకుని అదే ప్రభుత్వం వివిధ సాంకేతిక కారణాలతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పైగా గత ప్రభుత్వం సదరు పేపర్ మిల్లుకి సంబంధించి ఎటువంటి అధికారిక జీవోను కూడా జారీ చేయలేదు.
రిలయన్స్ పరిశ్రమ భూములు తిరిగి తీసుకోవడానికి కారణం వేరే. ఆ పరిశ్రమ స్థాపనకై EMD మొత్తం రూ.3,50,91,378/- చెల్లించింది (రూ. మూడు కోట్ల యాభై లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మాత్రమే). తర్వాత, శ్రీ పి.రోజా , ఆర్. విజయమ్మ భూ సమీకరణ ప్రక్రియను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా నలుగురిపై 2018 యొక్క WP నం. 18437ను దాఖలు చేశారు. M/s. రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ (పి) లిమిటెడ్., తమ లేఖ తేదీ: 15.03.2019 ప్రకారం, అన్ని వ్యాజ్యాలు , భారాల నుండి విముక్తి పొందిన భూమిని వారికి కేటాయించిన తర్వాత బ్యాలెన్స్ చెల్లింపు చేయబడుతుంది. తదనంతర పరిణామాలలో 13.09.2019న భూ కేటాయింపు రద్దు చేయబడింది . కంపెనీ చెల్లించిన EMD మొత్తం రూ.3,08,58,929/- 19.10.2020న తిరిగి చెల్లించబడింది.
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ నోడ్ లను తీర్చిదిద్దింది.విశాఖపట్నంలోని నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్లను , అదే విధంగా చిత్తూరు నోడ్ లో భాగంగా ఏర్పేడు-శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలను కల్పించింది. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్ టెర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్ లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్ లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. తద్వారా నాయుడుపేటలో 276 పరిశ్రమలను ఏర్పాటు చేసి రూ.3,051 కోట్ల పెట్టుబడులు, 9,030 ఉద్యోగాలను కల్పించింది. అచ్యుతాపురంలో మొత్తం 2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు, 60 వేల మందికి ఉద్యోగాలను అందించింది.
చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా క్రిష్ణపట్నం ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం పారిశ్రామిక నోడ్ గా తీర్చిదిద్దుతోంది. తిరుపతి జిల్లాలోని 2,500 ఎకరాలలో క్రిస్ సిటీ ఏర్పాటు చేయడం కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అందుకోసం ఏకంగా రూ. 1448 కోట్లను వెచ్చించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. దీని ద్వారా రూ.5వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయం.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిలో 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేసింది. కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఎమ్ఎస్ఈ -సీడీపీ , వైఎస్ఆర్ ఈఎంసీ, వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే రూ. 2595.74 కోట్ల ఎన్ఐసీడీసీ నిధులతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్ అండ్ ప్లే పరిశ్రమల కోసం ఇప్పటికే 4 షెడ్ల నిర్మాణం పూర్తయింది. తద్వారా 1,875.16 కోట్ల పెట్టుబడులు, 13, 776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది.
పారదర్శక పెట్టుబడుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020-23 ను తీసుకువచ్చింది. అంతేకాదు, మునుపెన్నడూ లేని విధంగా “వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం” పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని జారీ చేసింది.
ఈ పారిశ్రామిక విధానం ప్రకారం, 9,140 ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు ప్రోత్సాహకాలకు అర్హత పొంది ఉన్నాయి. వీటి వల్ల రూ.7,267.53 కోట్ల పెట్టుబడులతో పాటు 52,468 మందికి ఉద్యోగాలు.
గత ప్రభుత్వం జూన్ 2019 నాటికి పెండింగ్లో పెట్టిన రూ.3409.కోట్ల ప్రోత్సాహకాలను గత మూడేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. 11,059 ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లకు సంబంధించిన రూ. 1324.53 కోట్ల బకాయయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిలు (7,039 ఎమ్ఎస్ఎమ్ఈలకు మంజూరు) ఏరియర్లను కూడా అందజేశాం. ప్రభుత్వం MSME యూనిట్లకు పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను క్లియర్ చేసింది. దీనితో పాటు 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ. 380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్ చేసింది, వీటిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న 49 టెక్స్టైల్ యూనిట్లకు రూ.242.13 కోట్లు విడుదల చేసింది. సాధారణ ప్రోత్సాహకాలతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రోత్సాహకాలను దశలవారీగా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తోంది.
దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ, అరబిందో, గ్రీన్ కో గ్రూప్, ఏస్ అర్బన్ డెవలప్ మెంట్ సంస్థలతో పంప్డ్ హైడ్రో స్టోరేజ్, సోలార్ పవర్, విండ్ పవర్ ప్రాజెక్ట్స్ నెలకొల్పేలా రూ. 1,26,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి అమలు ద్వారా రాష్ట్ర యువతకు 38వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం యొక్క విస్తృత రంగాల వారీగా వృద్ధి రేట్లు , అదే విధంగా 2018-19 నుండి 2021-22 మధ్య కాలంలో GVA, GSDP మరియు తలసరి ఆదాయం యొక్క మొత్తం వృద్ధి రేట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దిగువ పట్టికలో వివరాల ప్రకారం , కోవిడ్ మహమ్మారి కారణంగా భారతదేశం అంతటా 2020-21లో వృద్ధి రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే ఆల్ ఇండియా గ్రోత్ రేట్లతో పోలిస్తే ఏపీ బాగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా, మొత్తం GSDP వృద్ధి రేటు అలాగే తలసరి ఆదాయం రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసింది. కాబట్టి తలసరి ఆదాయం సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసిందని చెప్పడం తప్పు.
2018-19లో, పరిశ్రమ రంగం యొక్క GVA వృద్ధి రేటు (స్థిరమైన ధరల వద్ద) 3.17% మాత్రమే.
2020-21 సంవత్సరానికి స్థిరమైన ధరల వద్ద పరిశ్రమల రంగం GVA వృద్ధి రేటు 0.33% (కోవిడ్ మహమ్మారి కారణంగా), ఇదే రంగంలో కేంద్ర ప్రభుత్వ వృద్ధి రేటు (-3.33% )కంటే ఎక్కువ.
2021-22 సంవత్సరానికి పరిశ్రమల రంగం యొక్క GVA వృద్ధి రేటు, కేంద్ర వృద్ధి 8% కాగా ఆంధ్రప్రదేశ్ అధికంగా 11% నమోదు చేసింది. రెండంకెల వృద్ధిని సాధించింది.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధికి వ్యాపార సంస్కరణల అమలుతో సహా అనేక క్రియాశీలక చర్యలను చేపట్టింది.
100% పర్సెప్షన్ సర్వే ఆధారంగా వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP) 2020-21 ర్యాంకింగ్స్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండవసారి అగ్రస్థానంలో ఉండటం గర్వించదగిన విషయం. 97.89% (భారతదేశంలోనే అత్యధికం) డీపీఐఐటీ చెప్పిన నివేదిక ప్రకారం, ఇది రాష్ట్రంలో వ్యాపార వాతావరణం గురించి అద్దం పడుతుంది.
*ఆంధ్రప్రదేశ్ లో కీలక ప్రాజెక్టులు క్రియాశీలంగా అమలులో ఉన్నాయి:*
అదానీ, సెంచురియన్ ప్లై, ఆదిత్య బిర్లా, ఆర్సెలర్ మిట్టల్, అపాచీ (హిల్టాప్ SEZ), టెక్స్పోర్ట్, గ్రీన్లామ్, ఇండోసోల్, కాసిస్, మిధాని, క్రిబ్ కో(KRIBHCO), జిందాల్ స్టీల్, ఎలక్ట్రో స్టీల్ , ఎకో(ECO) స్టీల్
*ఇంకా,ఈ క్రింది కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి:*
సన్ ఫార్మా, శ్రీ సిమెంట్స్, టాటా, గ్రీన్టెక్ (తైవాన్), పునరుత్పాదక ఇంధనం, ఫోటోవోల్టాయిక్, ముల్క్ హోల్డింగ్స్, క్రిటాన్స్ ఏవియేషన్ , క్రాస్ అట్లాంటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ LLC.
—————-
Comments are closed.