బెంగళూరు: ప్రతినిధి సౌత్ 9
ఒకప్పటి హీరోలు అడవులను కాపాడేవారిగా నటించి మెప్పిస్తే…ఇప్పటి హీరోలు ఆ ఆడవులను నరికే వారిగా నటిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు పవర్ స్టార్, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ … బెంగుళూరు పర్యటనలో ఉన్న ఆయన నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు..అనంతరం ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే భేటి అయ్యారు.. దీనికి ముందు అక్కడి మీడియాతో మాట్లాడుతూ, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో అడవులను నరికివేస్తున్నారని అన్నారు. నాకు చాలా నచ్చింది ఏంటి అంటే దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన చిత్రం గంధడగుడి. ఈ సినిమా థీమ్ ఏంటి అంటే అడవులను కాపాడడం. నాకు కూడా ఇలాంటి సినిమాల్లో నటించాలా అనిపించేది. ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది. నేను ఆ పరిశ్రమలో ఉన్నానని అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంటుంది. ఇలాంటివి తగ్గి మళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు..
ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికడదాం ..
ఆ తర్వాత . కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ చర్చలు జరిపారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరారు. అలాగే ఎపిలో ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడ ట్రైన్డ్ ఏనుగులను పంపాలని కోరారు పవన్..
సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ను కర్నాటన మంత్రి సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
Comments are closed.