The South9
The news is by your side.
after image

ఏపీలో ఆహారశుద్ధి పరిశ్రమల ప్రారంభోత్సవాలు.. 13 ప్రాజెక్టుల్లో రూ.3,058 కోట్ల పెట్టుబడులు, 7 వేల మందికి ఉపాధి

తేది: 04-10-2023*

*స్థలం: తాడేపల్లి*

 

*ఏపీలో ఆహారశుద్ధి పరిశ్రమల ప్రారంభోత్సవాలు.. 13 ప్రాజెక్టుల్లో రూ.3,058 కోట్ల పెట్టుబడులు, 7 వేల మందికి ఉపాధి*

*ఈ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే*

 

Post Inner vinod found

*పరిశ్రమల ఏర్పాటుతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి.. పరోక్షంగా 90,700 మంది రైతులకు లబ్ధి.. ప్రారంభోత్సవంలో సీఎం జగన్*

 

“ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగాభివృద్ధిలో నేడు మరో కీలక అడుగు పడిందని సీఎం జగన్ ప్రారంభించారు. ఏపీలో 13 ఆహారశుద్ధి పరిశ్రమలను సీఎం జగన్ బుధవారం నాడు వర్చువల్‌గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 3058 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాట‌వుతున్న ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగావకాశాలు ద‌క్కుతాయ‌ని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం జగన్ చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు కార్యక్రమం జరిగాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని.. పరోక్షం 90,700 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని సీఎం పేర్కొన్నారు. 12 నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను జగన్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా కంచరపాలెం దగ్గర రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్‌ యూనిట్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

 

Post midle

అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్‌ ఇండియా, బాపట్ల జిల్లా కొరిసిపాడు దగ్గర శ్రావణి బయో ఫ్యూయల్‌ రూ.225 కోట్లు, తిరుపతిలోని నాయుడుపేటలో రూ. 800 కోట్లతో గ్రీన్‌లామ్‌ సౌత్, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ. 200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి దగ్గర రూ. 150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి దగ్గర రూ. 125 కోట్లతో యునైటెడ్‌ ఇండస్ట్రీస్‌ ఆటో ప్లాస్టిక్, మడకశిర వద్ద రూ. 250 కోట్లలతో ఎవరెస్ట్‌ స్టీల్‌ బిల్డింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులను సీఎం జగన్ క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

Post midle

Comments are closed.