The South9
The news is by your side.
after image

కంఠంనేని” కెరీర్ లో మరో కలికితురాయి.

“కంఠంనేని” కెరీర్ లో

మరో కలికితురాయి!!

 

తను నటించే ప్రతి చిత్రంతో నటుడిగా రాణిస్తూ, ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్నారు ప్రముఖ నటుడు శివ కంఠంనేని. “అక్కడొకడుంటాడు, శివ కా సూర్య (భోజపురి), మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి” వంటి చిత్రాలతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న శివ… తన నటనకు అవార్డులు కూడా దండిగా అందుకుంటున్నారు. ముఖ్యంగా “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రంలో కంఠంనేని కనబరిచిన నటన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రశంసలు పొందడం విశేషం!!

 

Post Inner vinod found

రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై, అవార్డు గెలుచుకున్న ఈ చిత్రం పలు ఇతర వేదికలపై సైతం అభినందనలు అందుకుంది. అంతేకాదు, పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సైతం బ్యాక్ టు బ్యాక్ అవార్డ్స్ అందుకుంటూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నారు. “కళాదర్భార్, వి.బి.ఫిల్మ్ అవార్డ్స్, దాసరి ఫిల్మ్ అవార్డ్స్” వంటి సంస్థల నుంచి గౌరవ పురస్కారాలు అందుకున్న ఈ ప్రతిభాశాలి… మే 5న హైదరాబాద్, శిల్పకళావేదికలో అంగరంగవైభవంగా జరిగిన “దర్శకరత్న డి.ఎన్.ఆర్.ఫిల్మ్ అవార్డ్స్” వేడుకలో స్పెషల్ ఆఫ్రిసియేషన్ అవార్డు గెలుచుకున్నారు!!

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ నటులు మోహన్ బాబు, మురళీమోహన్ లతోపాటు… సీనియర్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు, దిల్ రాజు, రోజా రమణి, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షకార్యదర్శులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్ – తుమ్మల ప్రసన్నకుమార్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, సెక్రటరీ దొరైరాజ్, సీనియర్ దర్శకులు ధవళ సత్యం, ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, సి.రాంప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, అవార్డ్స్ కమిటీ చైర్మన్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అవార్డ్స్ కమిటీ సభ్యులు- ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితర లెజెండ్స్ సమక్షంలో ఈ అవార్డును ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, కె.అచ్చిరెడ్డి, ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి చేతుల మీదుగా శివ కంఠంనేని అందుకున్నారు!!

 

“యావత్ తెలుగు చిత్రసీమ తరలివచ్చిందా” అన్నంత అంగరంగవైభవంగా జరిగిన దర్శకరత్న డి.ఎన్.ఆర్.ఫైల్మ్బ్ అవార్డ్స్ లో “స్పెషల్ ఆఫ్రిసియేషన్” అవార్డు అందుకోవడం తనకు చాలా గర్వంగా ఉందని శివ కంఠంనేని అన్నారు. భోజపురిలో శివ కంఠంనేని టైటిల్ రోల్ పోషించగా ఘన విజయం సాధించిన “శివ కా సూర్య” తెలుగులో “బిగ్ బ్రదర్”గా రానుంది. “భోజపురి రాజమౌళి”గా మన్ననలు పొందుతున్న గోసంగి సుబ్బారావు ఈ చిత్రానికి దర్శకుడు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో.. శివ కంఠంనేని కీలక పాత్రలో నటించిన “ఆదిపర్వం”తోపాటు.. ఆయన టైటిల్ రోల్ ప్లే చేసిన “బిగ్ బ్రదర్, మణిశంకర్” చిత్రాలు కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి!!

Post midle

Comments are closed.