అమరావతి : కృష్ణా జలాల పంపకం విషయంలో కేసీఆర్ కు ధీటుగా సమాధానం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో సగభాగం తెలంగాణకే దక్కాలి అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీటైన సమాధానం ఇచ్చారు. ఒక్క నీటి చుక్క ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి చేయాలో అన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని, కేంద్రం కూడా మధ్య వర్తిత్వం వహిస్తుందని అని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే రెచ్చిపో మని సమయం సందర్భం చూసుకుని స్పందిస్తామని సజ్జల అన్నారు. అలానే ఇదేదో రెండు దేశాల మధ్య వ్యవహారం కాదని రెండు తెలుగు రాష్ట్రాల సమస్యని దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కడా కెసిఆర్ పేరు ప్రస్తావించకపోయినా తను ఇచ్చిన సమాధానం మాత్రమే కెసిఆర్ కీ గట్టి కౌంటర్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కృష్ణ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ గా ఉందనే విషయం సజ్జల మాటలతో తేటతెల్లమయింది.
Comments are closed.