మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలింది అని ప్రకాష్ రాజ్ వర్గం వైపు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ గా ఉన్నాడని ప్రచారం జరిగింది. మరొకవైపు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు మా అధ్యక్షులు బరిలో నిలిచి విజయం సాధించిన సంగతి విధితమే. అయితే ఎక్కడ బహిరంగంగా ప్రకాష్ రాజుకు మద్దతు ఇస్తున్నట్టు చిరంజీవి ప్రకటించిన పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరు పెద్దదిక్కుగా ఉంటారనే విషయంపై రకరకాల ఊహాగానాల నేపథ్యంలో ఈ రోజు పెద్దరికం హోదాపై చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
- నేను పెద్దగా ఉండను కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటాను
- అవసరం వచ్చినప్పుడు నేనున్నానని ముందుకు వస్తాను
పెద్దరికం నాకొద్దు..మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్గత కొన్ని రోజులుగా టాలీవుడ్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈవెంట్ సందర్భంగా దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు. ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరగా చిరంజీవి ఈ విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కరోనాతో చాలామంది ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికిపోయారు. సినీ కార్మికుల కోసం ఏదైనా చేయాలనీ ఆలోచించాను. సినీ కార్మికులకు భవిష్యత్ లో ఏం కావాలన్నా చేస్తా. అయితే సినిమా ఇండస్ట్రీకి నేను పెద్ద కాను. ఆ పదవిలో ఉండలేను. అవసరానికి అండగా ఉంటా. అంతేకానీ అనవసర పంచాయతీలు నాకొద్దు. బాధ్యతగా ఉంటా.. సమస్యలొస్తే ఆదుకుంటా. అంతకుమించిన వ్యవహారాలను పట్టించుకోను. ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ముందుకు రాను” అంటూ వ్యాఖ్యానించారు.
Comments are closed.