అమరావతి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హైకోర్టుతో పాటు, దిగువ న్యాయస్థానాలకు నాలుగు రోజులు ముందే సెలవులు ప్రకటించారు. గతంలో మొదటి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 14 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువ ఉన్నందువల్ల ఈ నెల 10 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు గా పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మరో మూడు రోజులు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇందుకు బదులుగా అక్టోబర్ 23 (శనివారం) తో పాటు సెలవు గా ప్రకటించిన నవంబర్ 3,5 తేదీలను పనిదినాలు గా పేర్కొన్నారు. అలాగే దిగువ న్యాయస్థానాల్లో ని అన్ని కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లకు గతంలోనే ఈనెల 14 నుంచి 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.
Comments are closed.