The South9
The news is by your side.
after image

  అన్ని విధాలా ఆదుకుంటా : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

తేదీ: 22-12-2021,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.                                                                                                                              అన్ని విధాలా ఆదుకుంటా : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఇటీవల సంగం వద్ద జరిగిన ఆటో ప్రమాద సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన చిన్నారిని చూసి చలించిపోయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

నవదీప్ (11) భవిష్యత్తుకు ఏం ఇబ్బంది రాకుండా రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి గౌతమ్ రెడ్డి

ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ది కూడా త్వరలోనే అందిస్తామని హామీ

బాబు చదువు బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా ఇచ్చిన మంత్రి మేకపాటి

నవదీప్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని మంత్రి సిబ్బందికి ఆదేశాలు

చిన్నారి చదువుకునేందుకు ఏ రకమైన సాయానికైనా సిద్ధమని మంత్రి వెల్లడి

Post midle

ఆర్థిక సమస్య లేకుండా అవసరమైతే ఇంట్లో పెద్దకు ఆత్మకూర్ పరిధిలో ఉద్యోగ అవకాశం

చదువుకున్న కుటుంబసభ్యులు ఎవరైనా ఉన్నట్లైతే వారి అర్హత, ఆసక్తి తగ్గట్టు ఉద్యోగాలు అందించేందుకు సిద్ధం అని ప్రకటించిన మంత్రి మేకపాటి

డిసెంబర్ 9న, సంగం మండలం బీరాపేరు వాగులో పడి ప్రాణాలు కోల్పోయిన జ్యోతి నగర్ కి చెందిన బాధిత కుటుంబానికి మంత్రి మేకపాటి పరామర్శ

Post Inner vinod found

వైయస్సార్ బీమా కింద మరోరూ.15 లక్షలు ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి సాయం

ఇటీవల సంగం మండలం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదం సంఘటన స్థలాన్ని పరిశీలించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి

బీరాపేరు వాగులో పడిపోయి గల్లంతైన వారి కోసం తీవ్రంగా శ్రమించిన మత్స్యకారులు, స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మరోమారు అభినందించిన మంత్రి గౌతమ్ రెడ్డి

“మీ సాహసం వల్లే ఆరుగురికి పునర్జన్మ అని మంత్రి వ్యాఖ్య”

అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు

వాగులో పడి ఒకే కుటుంబానికి చెందిన 12 మంది పడిపోయారని వార్త విన్న వెంటనే నా మనసు చలించిపోయింది

ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోవడం, ఇప్పటికీ గల్లంతైన వారిలో ఇద్దరు కనుమరుగవడం తీవ్ర వేదన మిగిల్చే చేదు జ్ఞాపకం

జిల్లా ఎస్పీ సహా, ఆత్మకూరు డిఎస్పి, ఆర్డిఓలను అప్పటికప్పుడు ఎలాగైనా కాపాడాలని ఆదేశించాం.. కలెక్టర్, జేసీల సహకారంతో ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపును మరిన్ని రోజులు పెంచినా దురదృష్టవశాత్తు సగం మందినే రక్షించుకోగలిగాం

బీర పేరు వాగు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకున్న ఆర్డీవో సహా, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభినందనలు

Post midle

Comments are closed.