- ప్రాపర్టీ ట్యాక్సు తగ్గించాలని వినతి
- సానుకూలంగా స్పందించిన మంత్రులు!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను కలిశారు. ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లీజు కాల వ్యవధిని పెంచాలని, స్టేడియంపై ఆస్తి పన్నును తగ్గించాలని అజార్ మంత్రులను కోరారు.
ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్లను వెలికితీసేందుకు హెచ్ సీఏ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, అజార్ విజ్ఞప్తిపై తెలంగాణ మంత్రులు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను కలిసిన సమయంలో అజార్ వెంట ఆయన తనయుడు అసద్ కూడా ఉన్నాడు.
Tags: Azharuddin, KTR, V Srinivas Goud, Rajiv Gandhi International, Stadium, Uppal, HCA Hyderabad
Comments are closed.