సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి
*సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి*
: *గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కావలియడవల్లి గ్రామ పర్యటన*
: *జోరు వానను సైతం లెక్కచేయక ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న విక్రమ్ రెడ్డి*
ప్రజలకు మూడేళ్ల కాలంలో ఇచ్చిన హామిలను 90 శాతానికి పైగా అందచేసే సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని *ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి* అన్నారు.
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *గడప గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమంలో భాగంగా తొలి రోజు బుధవారం ఏఎస్ పేట మండలం కావలియడవల్లి గ్రామంలో *నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డితో* కలసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా తొలుత హసనాపురం సెంటర్ లో *దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఆయన సిబ్బందితో సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు*.
అనంతరం గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వాలంటీర్ల ద్వారా చెప్పించి ఇవ్వని మీకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తన సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమించారని, ఆయన స్థానంలో వచ్చిన తాను సైతం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
చేనేతలకు అండగా జగనన్న :
చేనేత కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆత్మకూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏఎస్ పేట మండలం కావలియడవల్లి వీవర్స్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చేనేత మగ్గాలను ఆయన పరిశీలించారు. అనంతరం సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అందులో భాగంగానే చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అందచేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంగా మగ్గం నేయడంతో అక్కడ ఉన్న చేనేతలు తమ హర్షం వ్యక్తం చేశారు.
చేనేత కార్మికులకు ఏ ప్రభుత్వం అందించని సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అందిస్తుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments are closed.