The South9
The news is by your side.
after image

గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించిన సీఎం జగన్*

post top

 

*తేదీ : 22–06–2023*

 

: అమరావతి*

 

*గ్లోబల్ సమ్మిట్ లోని రూ.1,425 కోట్ల పెట్టుబడులు సాకారం*

*ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో 3 కంపెనీల నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్ధాపన*

*క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరణ*

*గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించిన సీఎం జగన్*

Post midle

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పలు కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఆచరణలోకి వస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ గురువారం నాడు వర్చువల్ గా నూతన కంపెనీలు, ఇతర కంపెనీల నిర్మాణ పనులను ప్రారంబించారు. ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్ధాపన చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు వండర్‌పుల్‌ మూమెంట్‌. దాదాపుగా రూ. 1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతొందన్నారు. దీనివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనీ, మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని, నెల్లూరులో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌ వస్తుందని సీఎం పేర్కొన్నారు. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవనున్నట్లు తెలిపారు. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్‌ కెపాసిటీతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ రెండు దశల్లో ప్లాంట్‌ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు వచ్చే గొప్ప మార్పుకు మంచి అవకాశం ఉందన్నారు. కృష్ణపట్నంలో ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చిన క్రిబ్‌కో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఎలాంటి సహకారం కావాలన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఈ సందర్బంగా పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

 

*రూ. 315 కోట్లతో బయో ఎనర్జీ ప్లాంట్*

 

“ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్‌ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్లాంట్‌ డైరెక్టర్‌ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

*తిరుపతిలో రూ. 400 కోట్లతో కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ*

 

“తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్‌ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.” అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నాను.

 

“ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధ ఏర్పాటు చేస్తుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయమని” సీఎం జగన్ అన్నారు.

 

Post Inner vinod found

*రూ. 1425 కోట్ల పెట్టుబడులతో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు*

 

రూ. 1425 కోట్ల పెట్టుబడులతో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మావతి, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

 

1. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్‌ తయారీని చేపడుతున్న క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌. రూ.610 కోట్ల పెట్టుబడి, 1000మందికి ఉద్యోగాలు. రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ తయారీ.

ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్‌ డిస్టిలరీ గ్రెయిన్స్‌.

 

2. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఇథనాల్‌ తయారీ కర్మాగారాన్ని పెడుతున్న విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్‌. రూ.315 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.

రోజుకు 200 కిలోలీటర్ల బయోఇథనాల్‌ తయారీ.

విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్‌ తయారీ.

వరిని సాగుచేస్తున్న రైతులకు అత్యంత ఉపయోగకరం.

అలాగే మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టలరీ తయారీ

బై ప్రొడక్ట్‌గా డ్రైడ్‌ డిస్టిలరీస్‌ గ్రెయిన్స్‌.

 

3. తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్‌ కాఫీ లిమిటెడ్‌ పుడ్‌ మరియు బెవెరేజెస్‌ కంపెనీ. రూ.400 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు.

సంవత్సరానికి 16వేల టన్నుల సొల్యుబుల్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ ప్లాంట్‌.

 

4. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ కంపెనీ.

రూ.100 కోట్ల పెట్టుబడి, 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు. రోజూ 400 టన్నుల ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ.

దీంతోపాటు రోజుకు 200 టన్నుల సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ యూనిట్‌.

వర్చువల్‌గా కంపెనీని సీఎం జగన్ ప్రారంభించారు.

Post midle

Comments are closed.