*జగనన్న మాట కోసం నరసరావుపేటకు వెళ్లా*
*… ముస్లిం మైనార్టీలకు సువర్ణ అవకాశం వచ్చింది*
*సమిష్టిగా పనిచేసి ఖలీల్ భాయ్ ను శాసనసభకు పంపిద్దాం*
*ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా తనను ఆదేశించగానే నరసరావుపేట ఎంపీగా వెళ్లేందుకు అంగీకరించానని, యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేసేవన్నీ వాస్తవాలు కాదని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని రాజన్న భవన్ వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను పోటీ చేసినప్పుడల్లా అనిల్ ఓడిపోతారని రకరకాల ప్రచారాలు చేశారని కానీ కసిగా పనిచేసే విజయం ఎలా ఉంటుందో వారికి రుచి చూపించానన్నారు. తనను ఎంత అణగదొక్కాలనుకున్న లేచానన్నారు.*
*నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ముస్లిం మైనార్టీలకు సువర్ణ అవకాశం వచ్చిందని 2024 శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత డిప్యూటీ మేయర్ నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ను ఖచ్చితంగా అందరి సహాయ సహకారాలతో శాసనసభకు పంపిస్తానన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు నగర ప్రజలు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీఎం జగనన్న ఆశీస్సులతో ప్రజల ముందుకు వచ్చిన ఖలీల్ భాయ్ ను గెలిపించాలని కోరారు. నగరం తన సొంత ఇల్లు అని.. ప్రజలు తన కుటుంబ సభ్యులు అని.. ఎవరిని తాను వదిలిపోవడం లేదని… కేవలం జగనన్న ఆదేశాలతో నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నానని… తాను ఎక్కడ ఉన్న 24 గంటలు.. 365 రోజులు నెల్లూరు నగరం గురించి.. నగర ప్రజల గురించి ఆలోచిస్తూనే ఉంటానన్నారు.నగర ప్రజలే తన దమ్ము ధైర్యం అని… ప్రత్యేకించి ముస్లిం సామాజిక వర్గం తన గుండెకాయతో సమానమని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒక సామాన్యుడికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ… అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఖలీల్ విజయం ఖాయమని.. ఆ దిశగా అందరూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు.*నగర నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*
Comments are closed.