అమరావతి : గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పై కేంద్ర హోంశాఖ కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు కనుసన్నల్లోనే పని చేశారని అభియోగాలు వినిపించాయి. అప్పటి ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేల ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి వెనకుండి వ్యవహారం నడిపిన వ్యక్తిగా ఏ బి వెంకటేశ్వరరావు పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. అలానే 2019 ఎన్నికల ముందు ఇంటలిజెన్స్ వ్యవస్థని చంద్రబాబుకు అనుకూలంగా మార్చాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ కి అనర్హుడని, డిస్మిస్ చేయాలని కేంద్ర హోంశాఖ కి లేఖ రాయడం సంచలనంగా మారింది. అయితే ఈ లేఖ కి ప్రతిస్పందనగా ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ఒక లేఖ రాశారు.. అందులో ముఖ్యంగా” ప్రతీకార చర్యలో భాగంగా నా మీద ఆరోపణలు సంధించారు అని, ఆధారాలు లేకపోయినా విచారణ అధికారి ఏకపక్షంగా నివేదిక ఇచ్చారని, అసత్య వివరాలు ఉన్న దానిని తిరస్కరించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో వైసీపీ నేతలకు అవకాశం దొరికినట్లయింది.. ప్రతీకార చర్యలో భాగంగానే అని రాశారు అంటే గతంలో కక్షపూరితంగా వ్యవహరించారు అనేది ఒప్పుకున్నట్టే కదా అంటూ కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నతాధికారులు, చట్ట ప్రకారం నడుచు కోకుండా, స్వామి భక్తి చాటుకుంటే, చివరికి సమస్యలు కొని తెచ్చుకుంటారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments are closed.