అమరావతి*
కమిషన్ల కోసం…
*గోదావరి గొంతు నులిమిన చంద్రబాబు*
*ప్రజల ప్రాణాలను తాకట్టుగా ప్రాజెక్టు పనులు*
*అసెంబ్లీలో సీఎం జగన్ భావోద్వేగం*
*పోలవరం అలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం*
మాజీ సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం గోదావరి నది గొంతు నులిమారు. పోలవరం నిర్మిస్తున్న ప్రాంతంలో 2.1 కిలోమీటర్ల పొడవున ప్రవహించాల్సిన గోదావరి నది వెడల్పు తగ్గించేలా తాత్కాలిక అవసరాల కోసం టీడీపీ ప్రభుత్వం తప్పుడు ఇంజనీరింగ్ అనుమతులు ఇచ్చిందని సీఎం జగన్ మండి పడ్డారు. వీటి వల్ల పోలవరం నిర్మాణంలో ఎంతటి ఘోర తప్పిదం జరిగిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. మొత్తం నదిలోని నీరు 380 మీటర్లు మరియు మరో రెండు 300 మీటర్ల సన్నని ఖాళీల గుండా వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ ను 680 మీటర్లు మరియు 120 మీటర్లకు పరిమితం చేశారు. ఈ పనులు నది ఒడ్డున నివసిస్తున్న వేలాది మంది ప్రాణాలను రిస్క్ లో పడేసింది అంటూ సీఎం జగన్ అసెంబ్లీలో భావోద్వేగం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదాలు వేల మంది ప్రాణాలను పణంగా పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌లో జాప్యానికి కారణమవుతున్నాయి. వీటిని ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు కప్పి పుచుతూ ఉంది. ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో పోలవరం నిర్మాణం పై పీపీటీ ప్రదర్శించారు. చంద్రబాబు నిర్ణయాలతో ప్రాజెక్టు పూర్తి చేయడంలో జరిగిన జాప్యాన్ని ఇరిగేషన్ ప్రత్యేక నిపుణులతో సరి చేస్తున్నామని ప్రకటించారు.
2018 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం చంద్రబాబు స్పిల్‌వే గ్యాలరీని సగం పనులు కూడా పూర్తి కాకుండా ప్రారంభించిన దృశ్యాలను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రదర్శించారు. పోలవరం అప్రోచ్ ఛానెల్ నిర్మాణం పూర్తి చేయకుండానే 2019 జూన్‌లో స్పిల్‌వే నిర్మాణానికి చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారని సీఎం ప్రశ్నించారు. అప్పట్లో చంద్రబాబు పూర్తి చేశానని చెప్పి ప్రారంభించిన అప్రోచ్ ఛానెల్‌ను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో పూర్తి చేసింది. దీనిపై భజనలు చేయించుకున్న చంద్రబాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అని సీఎం జగన్ సూచించారు. దింతో పాటు గత రెండేళ్లలో టీడీపీ అనుమతులు ఇచ్చిన ఇంజనీరింగ్ లోపాలను రద్దు చేయడానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో స్కారింగ్ పనులను చేపట్టినట్లు వివరించారు. పోలవరం ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణం. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రాజెక్టు పనులు తిరిగి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు.
Comments are closed.