ఊహాగానాల జర్నలిజం…
పాత్రికేయ వృత్తిలో పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాయి. అలాగే ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువచ్చే ప్రతి పథకాన్ని దానిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలుసుకునేందుకు గాను ముందుగా పత్రికలను వినియోగించుకుంటూ ప్రజా స్పందనను తెలుసుకుంటూ ఆ పథకాలను ప్రవేశ పెట్టాలా వద్దా అని బేరీజు వేసుకుని వాటి అమలుకు తొలగింపుకు వారధిగా పత్రికలను వినియోగించుకునే విధానం నాటి పాలకులది. అయితే ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల సారాంశం మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో ఊహాగానాలకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. అంటే ఊహాగానాల జర్నలిజం ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఏ విధంగానూ తోడ్పాటును ఇవ్వలేదు. అలా అని కీడు చేయదు. కానీ ఆలోచనలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భావనలో వ్యతిరేకతను మాత్రం తీసుకొస్తుందని కచ్చితంగా చెప్పగలం. ఇందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఇందుకు అందంగా జర్నలిస్టులు ఎవరికి తోచిన, ఎవరికి నచ్చిన విధంగా వారి ఊహాగానాలను మాధ్యమాలలో ఉంచుతూ తోటి పాత్రికేయులను సైతం తప్పు దోవలో పయనించేలా చేస్తోంది. ఈ ధోరణిని మార్చుకోవాలని నా మనవిగా విన్నవించుకుంటున్నాను.
ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం కార్య రూపం దాల్చే సమయం ఆసన్న మవుతున్న తరుణంలో తోటివారిని కించపరుస్తూ వసుదైక కుటుంబం, నాలుగవ స్థంభంగా ఉన్న జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నాయకులు మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న విధానానికి వ్యతిరేకత కనబడుతుంది. ఆ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని విభేదాలు రాకుండా వారికి చేయవలసిన లేదా అందించాల్సిన సమాచారాన్ని సరైన సమయానికి అందించకలిగినట్లయితే పాత్రికేయుల మధ్యన మనస్పర్ధలు ఉండవని మేధావి వర్గం చర్చించుకుంటూ ఉంది.
ఒకే వర్గానికి చెందిన వారు ఇలా పలు దారులను ఎంచుకొకుండ సమస్యను ఒక వేదికపైకి తెస్తే పరిష్కారం సులభతరమవుతుంది అన్న విషయాన్ని విస్మరించారు. విజ్ఞులు, పూజ్యులు ఆరాధ్యుల యిన సీనియర్ పాత్రికేయులు చొరవ తీసుకుని ఇలా వస్తున్న మనస్పర్ధలు తొలగిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.
తోట విష్ణువర్ధన్ హైదరాబాద్.
Comments are closed.