చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు ఇళ్లపట్టాల మంజూరులో రెవెన్యూ అధికారులు సహకరించడంలేదని ఆమె ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం బయటకు వచ్చింది. ఆ వెంటనే ఆమె భవనంపై నుంచి కిందికి దూకింది. పై నుంచి కిందకు దూకడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
గాయపడిన ఆమెను వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మరింత మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Comments are closed.