The South9
The news is by your side.
after image

ప్రముఖ హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టు లక్ష జరిమానా!

చెన్నై ప్రతినిధి :  ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ కి  మద్రాస్   హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు కి సంబంధించిన అడ్వాన్స్ టాక్స్ చెల్లించడంలో విఫలమైనందున మద్రాస్ హైకోర్టు హీరో విజయ్ కి లక్ష రూపాయల జరిమానా విధించింది. వాణిజ్య పన్నుల శాఖ చేసిన పన్ను డిమాండ్ ను హీరో విజయ్ సవాల్ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. దీనికి సంబంధించి, జస్టిస్ ఎస్ .ఎం సుబ్రహ్మణ్యం తను వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నటుడికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని, అభిమానులు ఇలాంటి హీరోల్ని నిజమైన హీరోలుగా చూస్తారు అని అన్నారు. అలానే పన్ను ఎగవేత ను దేశ వ్యతిరేక అలవాటు గా అభివర్ణించారు. ఈ నటులు సమాజంలో సామాజిక న్యాయం తీసుకురావడానికి తమన సూపర్ హీరోలుగా చిత్రీకరించుకుంటున్నారు. వారి సినిమాలు సమాజంలోని అవినీతి కార్యకలాపాలు కి వ్యతిరేకంగా ఉన్నాయి, వీరు మాత్రం పన్ను ఎగవేసే స్తున్నారు. ఇది చట్టాల నిబంధనలకు అనుగుణంగా లేదని జస్టిస్ సుబ్రహ్మణ్యం అన్నారు. పిటిషనర్ ఎంట్రీ టాక్స్ చెల్లించకపోవడాన్ని ఎప్పటికీ ప్రశంసించలేనని పేర్కొన్న న్యాయమూర్తి, టిక్కెట్టు చెల్లించి సినిమా చూసే లక్షల మంది అభిమానులు కలిగిన హీరో వారి మనోభావాలను గౌరవించాలన్నారు. అలానే డిపార్ట్మెంట్ కోరిన విధంగా పన్నులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Post midle

Comments are closed.