- నెల్లూరు జిల్లాలో బయటపడిన నకిలీ చలానాల వ్యవహారం
- జిల్లాలో విజిలెన్స్ విచారణ జరిపితే మరిన్ని నిజాలు
- రిజిస్ట్రేషన్ శాఖ లో అవినీతి వీరులు!
- నాయుడుపేటలో ఐదు లక్షల నకిలీ చలానాలు నెల్లూరు ప్రతినిధి ; రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల వ్యవహారం నెల్లూరుజిల్లాలో కూడా బయటపడడం జరిగింది. గత ఏడాది మార్చి 31 వరకు చలానాల ద్వారా జరిగిన ఫీజులు చెల్లింపులు పరిశీలిస్తున్న క్రమంలో నెల్లూరు జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని నాయుడుపేటలో 20 _21 ఏడాదిలో 5లక్షల విలువైన ఫేక్ చలనాల తో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కడప ,కృష్ణాజిల్లాలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగులోకి రావడంతో జిల్లాలోని అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది జరిగిన ఇంటర్నల్ ఆడిట్ లో తేడా జరిగిందని కాగ్ నివేదికలో పొందుపరిచిన అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్టార్ లు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అనేది బహిరంగ రహస్యమే! ఉన్నత అధికారులు దీనిపై ఎందుకు దృష్టి సారించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది నెల్లూరు రీజియన్ పరిధిలోని నవంబర్ నుంచి ఆడిటింగ్ జరగటం లేదు. అలానే దాదాపు 300 పైచిలుకు డాక్యుమెంట్ల స్టాంపు డ్యూటీ లో తేడాలు ఉన్నాయని గుర్తించారు. ఇక నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట ,బుచ్చిరెడ్డిపాలెం లో గత ఏడాది డిసెంబర్ నుంచి ఆడిట్ జరగలేదు. అలానే నెల్లూరు పరిధిలో పలు నిషేధిత జాబితాలో భూముల ఉన్న సర్వే నెంబర్లు ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని తెలిసిన , చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులపై, వారి శాఖ అధికారులు మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా నెల్లూరు జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుపై దృష్టిసారించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలని కోరుతు న్నాం.
Comments are closed.