The South9
The news is by your side.
after image

ప్రతి మహిళ సెల్ ఫోన్ లో దిశ యాప్ ఉండాలి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అమరావతి.

లా అండ్‌ ఆర్డర్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

*అమరావతి:*
*లా అండ్‌ ఆర్డర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష*

*– ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం… తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.*

*ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌:*

*– రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సమీక్షించిన సీఎం*
– ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు
– దిశయాప్‌ద్వారా 5238 మందికి సహాయం
– దిశయాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684
– నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేశామన్న పోలీసులు
– వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్న పోలీసులు
– దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చిందన్న పోలీసు అధికారులు.

– మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు
– ‘దిశ’ అమలు కారణంగానే ఇది సాధ్యమైందన్న పోలీసులు
– జీరో ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేస్తున్నామన్న పోలీసులు
– ఫోరెన్సిక్‌ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందన్న పోలీసులు
– గతంలో డీఎన్‌ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు
సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామన్న పోలీసులు

Post midle

*ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ .. మాట్లాడుతూ
– ‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి: సీఎం
– రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలి: సీఎం
– అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం
– ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్‌ డౌన్లోడ్‌ కావాలి:
– వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి:
– ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి:
– ‘దిశ’యాప్‌ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలన్న సీఎం

*‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష:*
– ‘దిశ’బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో వివరాలు అందించిన అధికారులు
– శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదన్న సీఎం
– వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
– ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్ష
– పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయన్న అధికారులు
– డిసెంబర్‌నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు
– మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయన్న అధికారులు
– కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందన్న పోలీసులు
– ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం ఆదేశం
– ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్న సీఎం
– పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలన్న సీఎం

*– ‘దిశ’ ఒన్‌స్టాప్‌ సెంటర్ల పనితీరుపైనా సీఎం సమీక్ష*
– ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2652 కేసులను దిశ ఒన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా హేండిల్‌ చేశామన్న అధికారులు
– సచివాలయాల్లో మహిళా పోలీసుల వ్యవస్థపైనా సీఎం సమీక్ష
– దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు పెట్టించామన్న అధికారులు

Post Inner vinod found

*‘బాధితులకు సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి’:*
– అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం ఆదేశం.
– శరవేంగా బాధితులను ఆదుకోవాలి: సీఎం
– వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి:
–ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి:
– ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి: సీఎం

*సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం:*
– సైబర్‌ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి: సీఎం
– సమర్థత ఉన్న అధికారులను ఇందులో నియమించండి:
– సమర్థవంతమైన న్యాయవాదులను కూడా ఈ విభాగంలో పెట్టాలి:
– ఏపీకి సంబంధంలేని డ్రగ్‌ వ్యవహారంపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు:
– లేని అంశాన్ని… ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు:
– వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారు :
– ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోంది: సీఎం
– పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతోపాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారు : సీఎం
– ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి:
– ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి:

‘కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం’:

– ఫిర్యాదుదారులకు వెసులుబాటుగా వ్యవస్థ ఉండాలి: సీఎం
– ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి:
– ఎఫ్‌ఐఆర్‌లు పెరుగుతాయని వెనకడుగు వేయకూడదు:
– బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి:
– బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం:

*‘‘మాదక ద్రవ్య రహితంగా కాలేజీలు, యూనివర్శిటీలు–తక్షణ చర్యలకు సీఎం ఆదేశం:*

– అన్నికాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి: సీఎం
– మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా? లేవా? సమీక్షించాలి:
– ఉంటే గనుక అలాంటి కాలేజీలను మ్యాపింగ్‌ చేయాలి:
– ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:
– కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు:
– దీన్ని ఒక సవాల్‌గా తీసుకోండి:
– కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి:
– ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి:
– ఒక కార్యాచరణను రూపొందించుకోండి:
అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్‌ ఫ్రీగా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం:

*‘మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం’:*

– రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్‌ఈబీ సహా… పోలీసులు ఉక్కుపాదం మోపాలి:
– అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం:
– మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం:
– మద్యం అమ్మకాల వేళలు తగ్గించాం:
– ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది:
– అంతేకాకుండా మద్యం రేట్లు పెంచాం:
– దీనివల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది:
– మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదు :
– దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి:
– ఎస్‌ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి:
– ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలి:
– గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
– అవసరమైతే చట్టం తీసుకురావాలన్న సీఎం

– ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించాం:
– ఈ మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి:
– డిసెంబరు నాటికి శిక్షణ పూర్తిచేయాలి:
– వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలన్న సీఎం
– దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధంకావాలన్న సీఎం

ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Post midle

Comments are closed.