The South9
The news is by your side.
after image

ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 

అమరావతి.

ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

*త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*లాజిస్టిక్ పాలసీ -2021 పై కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్*

*మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తోన్న ఏపీ*

Post midle

*మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై జరిగిన సమీక్ష*

*వెలగపూడి సచివాలయంలోని సమావేశమందిరంలో మంగళవారం సమీక్ష*

కేంద్రస్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి సీఎస్ ఛైర్మన్ గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ (ఎస్ఎల్ సీసీ)ఏర్పాటుకు ఉత్తర్వులు

మేజర్, మైనర్ పోర్టులు, కోల్డ్ స్టోరేజ్ లు, వేర్ హౌస్ లు, సరకు రవాణా వాహనాలు కీలకం

పాలసీ రూపకల్పనలో భాగంగా సింగపూర్ తరహా దేశాలలో మోడళ్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్

వ్యాపారులు, తయారీదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మంత్రికి వివరించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంపు సహా, నాన్ మేజర్ పోర్టులలో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026 కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళిక

Post Inner vinod found

క్రిష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు

ఏపీఐఐసీ భూములలో పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి పరిశ్రమల శాఖ కృషి

రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులకు సమీపంలో 5 ఎకరాల విస్తీర్ణణంలో సరకు రవాణాలో కీలకమైన ట్రక్ పార్కింగ్ బేల నిర్మాణం

పార్కింగ్ బేలలో ఫ్యూయల్ స్టేషన్, పార్కింగ్ స్లాట్లు, దాబాలు, డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాలకు ప్లాన్

ఎగుమతుల పాలసీపైనా ఆరా తీసిన పరిశ్రమల శాఖ మంత్రి

ఇటీవల మంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం, పెట్రో కాంప్లెక్స్ కి సంబంధించిన ప్రస్తుత పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి

ఐ.టీకి సంబంధించి విశాఖలో 2 ఐకానిక్ టవర్లను నిర్మించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపైనా చర్చ

ఇటీవల కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పుల దృష్ట్యా మరోసారి ఢిల్లీ వెళ్లి కొత్త మంత్రులను కలిసేందుకు నిర్ణయం

వచ్చేవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమీక్ష సమావేశం దృష్టిలో ఉంచుకొని…చర్చల దశను దాటి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వాటి వివరాలను ముఖ్యమంత్రికి వివరించేందుకు జాబితాను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశం

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన పరిశ్రమలతో జరిగిన తాజా చర్చలలో పురోగతిని స్పెషల్ సెక్రటరీ, డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్న పరిశ్రమల శాఖ మంత్రి

ఎమ్ఎస్ఎమ్ఈపై మరింత శ్రద్ధ పెట్టాలని దిశానిర్దేశం

రామాయపట్నం బిడ్డింగ్ పై ప్రత్యేక కార్యదర్శి కరికాలతో ఆరా

రామాయపట్నం సమీపంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూ సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశం

సమావేశానికి హాజరైన ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, పరిశ్రమల శాఖ సలహాదారులు క్రిష్ణ వి గిరి, లంకా శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు

———-

Post midle

Comments are closed.