The South9
The news is by your side.
after image

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.*
*తొలి దశ ప్రక్రియ ఇలా..*
*మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది.*
*జనవరి 23: నోటిఫికేషన్‌ జారీ*
* 25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ*
* 27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు*
* 28: నామినేషన్ల పరిశీలన*
* 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన*
* 30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం*
* 31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల*
* ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)*
* పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.*

Post midle

Comments are closed.