*ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: వర్షంలోనూ సాగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు తెలుపుతున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండలం మురగళ్ల సచివాలయం పరిధిలోని బండారుపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.*
*ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో వర్షం కురవడంతో వర్షంలోనే ప్రతి గడపకు వెళ్లి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి అందచేసిన సంక్షేమ పథకాల లబ్ది కరపత్రాలను వారికి అందచేశారు.*
*ఈ సందర్భంగా గ్రామ ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్న సందర్భంగా మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులను సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఓ దివ్యాంగ మహిళ తనకు సర్టిఫికేట్ మంజూరు చేయించాలని విన్నవించడంతో వెంటనే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఆ మహిళకు సర్టిఫికేట్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.*
*ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న సమయంలో కాలనీకి చెందిన ఇండ్ల కృష్ణవేణి అనే మహిళ తనకు పించను మంజూరు చేయించాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి తన స్వంత నిధులు రూ.9వేలు ఆ మహిళకు ఆర్థిక సహాయంగా అందచేశారు. పించను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆ మహిళకు హామి ఇచ్చారు.*
*గ్రామంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణాలపై పలువురు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులను ప్రతిపాదనలు సిద్దం చేసి తమకు అందచేయాలని పనులు మంజూరు చేయిస్తానని తెలిపారు. వర్షాకాలం వస్తున్నందున పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.*
*పలువురు రెవెన్యూ సమస్యలను, రేషన్ కార్డు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించడంతో వాలంటీర్లను, గ్రామ రెవెన్యూ అధికారులను ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను నమోదు చేసుకుని జాబితాలను తమకు అందచేయాలని, సమస్యల పరిష్కారిస్తామని అన్నారు.*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తున్నారని, అభివృద్ది పనులు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపిన అన్ని పనులు త్వరగా చేపట్టే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.*
*అంతకు ముందుగా గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు కోనేపల్లి సుబ్బారెడ్డి ఇటివల గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో ఆయనను పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.*
Comments are closed.