ఢిల్లీ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ పై నమోదైన కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2014 జనవరిలో శశిధరూర్ భార్య సునందా పుష్కర్ ఢిల్లీలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమె శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా తేలగానే హత్య కేసుగా భావించారు. అయితే ఆమెది ఆత్మహత్య అని చార్జిషీట్లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులు. శశిథరూర్ పై మ్యారిటల్ క్రూయాలిటీ, ఆత్మహత్య కై ప్రేరేపించడం వంటి నేరాలు కింద కేసులు నమోదు చేశారు. దీంట్లో భాగంగా ఇంతకాలం విచారణ జరుగుతూ వచ్చిన ఈ కేసులో తగినన్ని ఆధారాలు చూపకపోవడంతో శశి థరూర్ పై మోపిన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. గతంలో వివాహమైన శశిథరూర్ కి సునంద పుష్కర్ రెండో భార్య వీరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా శశిధరూర్ పేరు దేశం మొత్తం వినిపించింది. ఈ కేసు విచారణ సమయంలో కూడా శశిధరూర్ రెండుసార్లు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందడం విశేషం.ఈ కేసులో తీర్పు ఇచ్చిన జస్టిస్ గీతాంజలి గోయల్ కి తన కృతజ్ఞత ను బహిరంగ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు శశిధరూర్.
— Shashi Tharoor (@ShashiTharoor) August 18, 2021
Comments are closed.