ఎర్రచందనం పరిరక్షణ పై చిత్తూరు, నెల్లూరు, కడప, తిరుపతి అర్బన్ జిల్లా, టాస్క్ ఫోర్స్ ఎస్పీలతో సమావేశం
ఎర్రచందనం పరిరక్షణ పై టాస్క్ ఫోర్స్ ఇంచార్జి డి ఐజీ కాంతి రాణా టాటా సోమవారం సాయంత్రం రాయలసీమ లోని నాలుగు పోలీసు జిల్లా ల ఎస్పీలతో పాటు అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్, కడప ఎస్పీ అంబురాజన్, చిత్తూరు ఏ ఎస్పీ శశిధర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు, డీఎస్పీ వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ నుంచి డీఎఫ్ ఓ లు పాల్గొన్నారు. ఈ జిల్లాల పరిధిలో జరుగుతున్న స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
అటవీశాఖ, పోలీసు, టాస్క్ ఫోర్స్ లతో కంబైన్డ్ ఆపరేషన్ లు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న బేస్ క్యాంపు ల గురించి చర్చించి, వాటిని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. స్మగ్లర్లు కాల్ డీటైల్స్ పై దృష్టి పెట్టాలని, దీనిపై తగిన చర్యలు తీసుకోవడం పై చర్చించారు. అదే విధంగా ఇంటలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నాన్ బెయిలబుల్ వారంట్లను స్మగ్లర్లు కు జారీ చేయడానికి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్ స్టేట్ ఆపరేషన్ లను చేపట్టడం పై కూడా చర్చించారు. ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ నుంచి ఆర్ ఐ భాస్కర్, సిఐ సుబ్రహ్మణ్యం, సిసి సత్యనారాయణ అటవీశాఖ అధికారులు నరేంద్రన్, హిమ శైలజ, నరసింహ రావు, లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.