The South9
The news is by your side.
after image

వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం: వై.యస్. జగన్

15-09-2022

అమరావతి

*వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం*

అభివృద్ధి ఫలాలు ప్రతి గడపకూ చేరుస్తాం

చంద్రబాబు బినామీల కోసమే అమరావతి

రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధికి వికేంద్రీకరణ ఒక్కటే మార్గం, రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు ఒక్కటే అన్ని ప్రాంతాలు సమున్నత అభివృద్ధి చెందాలి. అన్ని ప్రాంతాల ప్రజల డబ్బును అమరావతి నిర్మాణం కోసం వందేళ్ల పాటు ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఇదే జరిగితే భవిష్యత్తులో తలెత్తే ప్రాంతీయ అసమానలతకు మన దగ్గర సమాధానం ఉండదు. అని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడం కోసం అమరావతి పేరుతో చేస్తున్న కుట్రలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణలపై గురువారం నాడు జరిగిన చర్చలో సీఎం జగన్ ప్రస్తావించారు. రాష్ర్టానికి పరిపాలనా రాజధానిగా ఉండాల్సిన అన్ని అర్హతలు విశాఖ నగరానికి ఉన్నాయి. అమరావతి కంటే తక్కువ నిధులతో విశాఖను అభివ`ద్ధి చేయవచ్చు. ఇతర నిధులతో అభివవృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాయలసీమ, కోస్తాంద్ర ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు అని పేర్కొన్నారు. అమరావతిపై మాటల్లో చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఒక్క శాశ్విత భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. అమరావతిలోని 53 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ఐదేళ్లలో రూ. 5,500 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు నిర్మించని, నిర్మించలేని రాజధాని గురించి అమరావతిలో ఏదో అద్భుతం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దృష్టిలో రాష్ర్టం అంటే మొత్తం 1.62 లక్షల చ.కి.మీ. అంతే కానీ 8 కి.మీ అమరావతి మాత్రమే కాదు. కనీసం లక్ష కోట్లు ఖర్చు చేస్తే అమరరావతిలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని, ఈ నిధుల్లో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ సహజ రాజధానిగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి నిర్మాణం మాత్రమే జరిగితే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కాదని, కేవలం సంపన్న వర్గాల ప్రయోజనాలను మాత్రమే కాపాడుతుందని అన్నారు.

*సీఎం జగన్ ప్రసంగంలోని కీలక అంశాలు*

Post midle

గత ప్రభుత్వాల బడ్జెట్‌కు, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ బడ్జెట్‌కు పెద్దగా తేడా లేదు. దాదాపు రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్ లో తమ ప్రభుత్వం అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, రైతు భరోసా వంటి సంఓేమ పథకకాల కింద రూ. 1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అందించాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతగా తాము విజయం సాధిస్తున్నాం. ఇదే అంశాలను చంద్రబాబు ఎందుకు చేయలేక పోయారు. నిబద్ధతతో పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. చంద్రబాబు తరహా పాలనలో అమరావతి నగరం లాంటి గ్రాఫిక్స్ మాత్రమే సాధ్యపడతాం.

Post Inner vinod found

అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయా వ్యవస్థను ఏర్పాటు, 13 జిల్లాలను 26కి పెంచి అద్భుతాలు చేస్తున్నాం. కోవిడ్ లాంటి విపత్తుల సమయంలో వికేంద్రీకరణతో పంపిణీ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది.

చంద్రబాబు పెత్తందారీ మనస్తత్వంతో బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది చంద్రబాబు మనస్తత్వం. చిట్‌ఫండ్‌ వ్యాపారమైనా తన వాళ్లే వ్యాపారం చేయాలనట్లు ప్రవర్తిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. మా నారాయణ, మా చైతన్య ఉండాలనుకుంటారు.

అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు. రాష్ర్టంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష.

టీడీపీ హయాంలోని ఐదేళ్లలో కనీసం ఫ్లై ఓవర్‌ను కూడా పూర్తి చేయలేక పోయారు. అమరావతిలో బినామీ భూముల ధరలు పెరిగేందుకు చంద్రబాబు విజయవాడ, మంగళగిరి అభివృద్ధిని అడ్డుకున్నారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఈ రెండు ఫ్లై ఓవర్‌లు పూర్తి చేశాం. ఐదేళ్లు అధికారంలో ఉండి కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ నిర్మించలేకపోయారు. తమ ప్రభుత్వంలో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడంతో వరద ముంపు భయం లేకుండా కృష్ణ లంక ప్రజలు ధీమాగా ఉంటున్నారు.

వికేంద్రీకరణ అనేది కేవలం రాజధాని కోసం మాత్రమే కాదు. సంఓేమ ఫలాలు అందరికీ అందాలన్న వికేంద్రీకరణ అవసరం. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడైనా గ్రామ సచివాలయాల గురించి ఆలోచించారా?. ఒక్కో సచివాలయంలో ప్రస్తుతం 600 రకాల సేవలు అందుతున్నాయి. సచివాలయాల్లో ఉద్యోగులుగా 83శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. 4 లఓల వలంటీర్లు రాష్ర్ట వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. ఇంటింటికీ రేషన్‌ అందిస్తున్నాం. 14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా ఇలా ఆలోచించారా?. 40 ఏళ్ల ఇండస్ట్రీ బాబుకు రైతుభరోసా కేంద్రాలు పెట్టాలన్న ఆలోచన రాలేదు. మారుమూల గ్రామాల్లో ప్రతి గడపకూ పాలన తీసుకెళ్లాం. పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఏమిటో చేసి చూపించాం.

ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు, విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేశాం. గత 75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే మేం వచ్చాక కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. రాష్ర్టంలో 16 మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. చివరికి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ పెట్టాలని నాకు లేఖ రాశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ పని చేయకుండా గాడిదలు కాశారా?

చంద్రబాబు డైరెక్షన్ లోనే అమరావతి పాదయాత్ర

తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని చంద్రబాబుకు తెలుసు. అమరావతి పాదయాత్ర ఆయన డైరెక్షన్ లోనే జరుగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ పోసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇంత దిగజారాలా? అందరూ బాగుండాలని కోరుకుంటే అది సమాజం. ఇంటింటికీ, మనిషి మనిషికీ మంచి చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.

Post midle

Comments are closed.