న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా కరోనా కేసులు అధిక భాగం మహారాష్ట్రలోని నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద ఈరోజు 70 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా కన్నా మన దేశంలోని ఈరోజు అధికంగా కేసులు నమోదు కాబడ్డాయి. అయితే ఒక్క ముంబైలోనే ఈరోజు 11 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి మహారాష్ట్రలో జిమ్ లు, సినిమా థియేటర్లు ,పార్కులు పాక్షికంగా మూసివేయడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. అలానే బాలీవుడ్ ప్రముఖ హీరోలు అక్షయ్ కుమార్, గోవిందా కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వీరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సినీ తారలు, క్రికెటర్స్ ఎక్కువగా కరోనా కి గురైనట్లు తెలుస్తోంది.
Comments are closed.