అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం తర్వాత మొదట్లో కేసుల సంఖ్య పెద్దగా లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ని విద్యార్థులు,టీచర్లు కరోనా బారిన పడుతున్నారని వార్తలు కాస్త కలవరపెడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 26 మంది విద్యార్థులు, టీచర్లు కు కరోన సోకినట్లు తెలుస్తుంది. నెల్లూరు జిల్లా కోట మండలం లోని చిట్టెడు గురుకుల పాఠశాలలో మొత్తం 19 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు సమాచారం. అలానే మనుబోలు మండలం లోని హైస్కూల్లో నలుగురు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోన సోకినట్లు తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా పదిమంది విద్యార్థులు కు కరొన సోకినట్లు సమాచారం. బాపట్ల నియోజకవర్గం లోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కి కరోనా సోకినట్లు తెలుస్తుంది. మూడవ దశ ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వం సూచనతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Comments are closed.