దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గతంలో రోజు, మూడు నాలుగు లక్షల కేసులతో, విజృంభించిన కరోనా ఇప్పుడు రోజు వారి కేసులు లక్ష కి దిగి వచ్చినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 1.00.636 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తుంది. అలానే రికవరీ రేటు 93 శాతానికి పెరిగిందిఅని , గత 24 గంటల్లో 15 లక్షల 87 వేల 589 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు సమాచారం. ఇప్పటిదాకా మొత్తం పరీక్షల సంఖ్య య 36 కోట్ల 63 లక్షల 30, 4111 కి చేరాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటి రేటు 6.34 కి చేరింది. ఇప్పుడే ఇప్పుడే ప్రజలు కరోనా గురించి కాస్త ఉపసమనం కలిగినట్లు భావిస్తున్నారు. అయితే మరల పిల్లలపై తాడ్ వేవ్ ప్రభావం పొంచి ఉందని సమాచారంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విధిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ ల వాడకం తప్పనిసరిగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Comments are closed.