*పారిశ్రామికాభివృద్ది సహకారం అందించండి ; ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సహకారం అందించాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అమరావతిలోని ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ డాక్టర్ గుమ్మల శ్రీజన, ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.*
*ఈ సందర్భంగా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పారిశ్రామికంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ది చెయ్యవచ్చో అధికారులతో సుదీర్గంగా చర్చించారు.*
*ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు తన సోదరుడు, దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేశారన్నారు. ఈ పార్కు ఏర్పాటు చేసిన సమయంలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సైతం ప్రకటించారన్నారు.*
*కానీ ఇంత వరకు నారంపేట సమీపంలోని ఎంఎస్ఎంఈ పార్కులో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు కాలేదు, దీనికి గల కారణాన్ని తెలుసుకొనగా పారిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే భూమి లీజు చాలా అధికంగా ఉందని పారిశ్రామికవేత్తలు భావించి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపినారు.*
*పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి మొదటి 25 శాతం ప్లాట్లను మార్కెట్ ధరకు కనీసం 50 శాతం రాయితీని కల్పిస్తే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారని, దీంతో ఆత్మకూరు నియోజకవర్గం పారిశ్రామికంగా వృద్ది చెందుతుందని భావిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.*
Comments are closed.