*తేది: 30-10-2023*
*స్థలం: ఉదయగిరి*
*ఉదయగిరిలో అట్టహాసంగా సామాజిక సాధికార యాత్ర*
*బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్ పాలన*
*పేదలను ఓటు బ్యాంకుగా చూసి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు*
*పెత్తందారుల వైపు చంద్రబాబు ఉంటే.. పేదల వైపు నిలబడిన జగన్*
*ఇద్దరి మధ్య తేడాను ప్రజలే గమనించాలని వైఎస్సార్ సీపీ నేతల విజ్ఞప్తి*
వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత యాత్రలో భాగంగా నాలుగో రోజు ఉదయగిరిలో జరిగిన బస్సుయాత్ర దిగ్విజయంగా జరిగింది. పదిందల ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉదయగిరి ప్రజల పాల్గొన్నారు. యాత్రలో ప్రారంభంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సాయంత్రం జరిగిన సభలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలో ఉపముఖ్యమంత్రులు కె. నారాయణ స్వామి, అంజాద్ బాషా, ఎంపీ బీద మస్తాన్ మాజీ మంత్రి అనీల్ కుమార్, తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
*రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్: ఎంపీ విజయసాయిరెడ్డి*
బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో సాధ్యం కాలేదని అన్నారు. మంత్రివర్గ కూర్పులో 68% శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆయా వర్గాలకు కేటాయించారని, మరోవైపు ఆయా పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించారని అన్నారు. నామినేటెడ్ పదువులు పదవీకాలం ముగియడంతో తిరిగి ఆయా స్థానాల్లో బడుగు,బలహీన వర్గాలతోనే భర్తీ చేశారని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో 80% బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత సీఎం జగన్ దేనని అన్నారు. సీఎం జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజలకు వివరించాలని సమావేశంలో విజయసాయి రెడ్డి కోరారు. ఉదయగిరి నియోజకవర్గం నండి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
*బలహీన వర్గాల పురోగతే సీఎం జగన్ లక్ష్యం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి*
ఎస్సీ, ఎస్టీ, బీసీలను దేశంలో అంటరానివారిగా చూస్తే మన సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరు సమానమే అని చెప్పి చేసి చూపించిన వ్యక్తి జగన్ అని ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అన్నారు. నవరత్నాలతో ప్రతి పేద, బడుగు జీవితాల్లో వెలుగు నింపారని, మాకు కులం, మతం, పార్టీ లేదని, రాబోయే రోజుల్లో పెత్తందారులకు, పేదలకు యుద్ధం జరగుతుందని అందులో జగనన్న గెలిపించుకుందామని అన్నారు. ఇప్పటివరకు ఎస్సీల కోసం రూ. 60,520 కోట్ల డీబీటి ద్వారా అందించి ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేసిన వ్యక్తి జగన్ అని ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కొనియాడారు.
*పెత్తందారుల చంద్రబాబు ఉంటే, పేదల వైపు సీఎం జగన్: మాజీ మంత్రి అనిల్ కుమార్*
రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, పెత్తందారులకు, పేదలకు యుద్దమని, పేదలకు అండగా నిలబడిన వ్యక్తి జగన్ అని, మనకి లక్ష కోట్లు పై గా ఇచ్చిన జగన్ కాపాడుకోవాల్సిన బాద్యత మనదే అని అనీల్ పిలుపునిచ్చారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్ద పీఠ వేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. భారతంలోని కృష్టుడి ఆశీస్సులతో, రామాయణంలోని రాముడి ఆశీస్సులతో, బైబిల్ లోని యేసు ఆశీస్సులతో, ఖురాన్ లోని అల్లా ఆశ్సీసులతో ఈ రాష్ట్ర ప్రజల బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఆశీస్సులతో జగన్ ని తాకే సత్తా ఎవరికి లేదని పేర్కన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, పిల్లలు బాగుంటారని ఆలోచించి ప్రతి పథకాన్ని మహిళ పేరు మీదే సీఎం జగన్ ఇస్తున్నారని, మహిళా పక్షపాతి సీఎం జగన్ అని ఎంపీ బీద మస్తాన్ అన్నారు.
*టీడీపీ హయాంలో 10 శాతం మంచి చేశారా.. స్రవంతి, నెల్లూరు మేయర్*
ఈ నాలుగున్నరేళ్లలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచిలో కనీసం 10శాతం కూడా చేయలేని దౌర్భాగ్య స్థిరిస్థితి గత టీడీపీ ప్రభుత్వానిదని నెల్లూరు మేయర్ స్రవంతి విమర్శించారు. “ఇంట్లో ఉండిపోయిన ఎస్సీ మహిళను నేను. నన్ను నెల్లూరు మేయర్‌ను చేసిన ఘనత జగనన్నది అంటూ బస్సు యాత్రలో మేయర్ పేర్కొన్నారు.
Comments are closed.