*తేదీ: 04-07-2023*
*స్థలం: చిత్తూరు*
*రూ.385 కోట్లతో చిత్తూరు డెయిరీ పునర్ధణకు సీఎం జగన్ శ్రీకారం*
*రూ.182 కోట్లు బకాయిలు తీర్చి డెయిరీని రీ ఓపెన్ చేస్తున్నాం.. అమూల్ ద్వారా రూ. 385 కోట్ల పెట్టుబడులు*
*తన హెరిటేజ్ డెయిరీ కోసం రైతుల చిత్తూరు డైయిరీ కుట్రపూరితంగా మూసేసిన చంద్రబాబు*
*14 ఏళ్ల పదవితో చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఒక్క మేలు చేయలేదు*
*వెల్లూరు మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీలే.. చిత్తూరు పర్యటనలో సీఎం జగన్ వ్యాఖ్యలు*
“హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నాం. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీ ఓపెన్ చేస్తున్నాం. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది” అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఏంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు మంగళవారం నాడు సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇదే చిత్తూరు జిల్లా ఒకప్పుడు కళకళలాడేదని, చిత్తూరు డెయిరీని 20 ఏళ్ల క్రితం 2002లో చంద్రబాబు కుట్రపూరితంగా మూసేశారని సీఎం జగన్ పేర్కొన్నారు. 1988లో రోజుకు 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేసేదని, ఆ తర్వాత చిత్తూరు డెయిరీలో రోజుకు 3 లక్షల లీటర్లకు ప్రాసెసింగ్ చేసే స్థాయికి చేరుకుందని, అటువంటి డెయిరీ పై చంద్రబాబు కళ్లు పడ్డాయని సీఎం అన్నారు. 1992లో ఏర్పడ్డా హెరిటేజ్ కోసం ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఇదే జిల్లాలోని అతిపెద్ద డెయిరీని కుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ వెళ్లరని, చెప్పపెట్టకుండా 2002 ఆగస్టు 31న నోటీసులు కూడా ఇవ్వకుండా మూత వేశారని చెప్పారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా వందల కోట్లు బకాయిలు పెట్టారని, లిక్విడేషన్ కూడా ప్రకటించారని, ఇదంతా కూడా చంద్రబాబు సొంత డెయిరీ బాగు కోసం జరిగిన కార్యక్రమమని దుయ్యబట్టారు.
*చిత్తూరు డైరీ రూ.182 కోట్లు బకాయిలను తీర్చాం.. అమూల్ ద్వారా రూ. 385 కోట్లు పెట్టుబడులు తెచ్చాం*
ఇచ్చిన మాట ప్రకారం ఈ డెయిరీని రూ.182 కోట్ల బకాయిలను తీర్చి, ప్రపంచంలోనే అతిపెద్ద కో–ఆపరేటివ్ డెయిరీ అయిన అమూల్‌ను తీసుకువచ్చామని, అంతేకాకు కాకుండా, వారు రూ.350 కోట్ల పెట్టుబడులు ఈ డెయిరీలో పెడుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ డెయిరీ మీద అమూల్ పెట్టుబడులు పెట్టడమే కాకుండా కో–ఆపరేటివ్ రంగంలోని లాభాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి బోనస్ ఇస్తూ.. అక్కచెల్లెమ్మలకు లాభాలను పంచిపెడుతోందని తెలిపారు. ఈ డెయిరీ చిత్తూరు జిల్లా రూపురేఖలు మార్చబోతుందని, తొలిదశలో రూ.150 కోట్లతో పనులు మొదలవుతున్నాయని సీఎం అన్నారు. మరో పది నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్ లక్ష లీటర్లతో మొదలవుతుందని తెలిపారు.
*ప్రత్యక్షంగా 5వేల మందికి, పరోక్షంగా 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు*
దశలవారీగా ఇక్కడే పాల పొడి తయారీ, యూహెచ్‌టీ పాల విభాగం, చీజ్, పన్నీరు, స్వీట్లు కూడా తయారు చేసే పరిస్థితి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏకంగా 10 లక్షల లీటర్లు ప్రాసెస్ స్థాయికి చేరుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెయిరీ ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పోందవచ్చని సీఎం జగన్ తెలిపారు. అంతేకాకుండా ఈ డెయిరీ చిత్తూరు జిల్లాకే కాకుండా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కూడా లబ్ది చేకూర్చుతుందాని పేర్కొన్నారు.
2020 డిసెంబర్ 2న జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ రెండేళ్ల కాలంలోనే అక్షరాల 8,78,56,917 లీటర్ల పాలు సేకరించామని సీఎం తెలిపారు. ప్రతి పది రోజులకు ఒకసారి అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మహిళా డెయిరీ సంఘాలకు పాలు పోస్తున్న వారికి ప్రతి లీటర్ గేదే పాలు అమూల్ రాకముందు రూ.67 ఉంటే, అమూల్ వచ్చిన తరువాత ఈ రెండేళ్లలో 8సార్లు రేటు పెంచుతూ ఈ రోజు రూ.89.76లకు పెంచారని, ఏకంగా లీటర్‌కు 22 రూపాయలు పెరిగిందని చెప్పారు. ఆవుపాలు గతంలో లీటర్‌కు రూ.32 ఉండేది .అమూల్ వచ్చిన తరువాత ఈ రెండేళ్ల కాలంలో 8సార్లు రేట్లు పెంచుతూ ఈ రోజు రూ.49లకు చేరిందని సీఎం అన్నారు. గతంలో మోసం చేయడానికి అలవాటు పడ్డ డెయిరీలన్నీ కూడా అమూల్ రాకతో వాళ్లు కూడా రేటు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
“రాష్ట్రంలో పాల సేకరణలో పోటీ వాతావరణం నెలకొంది. దీని వల్ల నా అక్కచెల్లెమ్మలకు, పాడి రైతులకు రూ.4243 కోట్లు అదనపు లబ్ధి చేకూరిందని చెప్పడానికి సంతోషపడుతున్నాను” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
*చంద్రబాబు నిజ స్వరూపం అర్ధమై కుప్పం ప్రజలు కూడా బై బై చంద్రబాబు అంటున్నారు*
చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా కనిపించదని, కాబట్టే చంద్రగిరి నుంచి కుప్పానికి ఈపెద్ద నాయకుడు వలస వెళ్లాడని సీఎం జగన్ విమర్శించారు. ఇప్పుడు ఆ కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం ప్రజలను మోసం చేసేందుకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటారని, దానికి కూడా మీ బిడ్డ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని నెపం వేస్తున్నాడని, అటువంటి మనిషి చేష్టలను గమనించాలని సీఎం జగన్ కోరారు.
*చంద్రబాబు తన హయాంలో 54 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలను సొంత మనుషులకు పప్పు, బెల్లాల్లా ఆమ్మేశారు*
ప్రభుత్వ, సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు, నూలు ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఒక పద్ధతిప్రకారం నష్టాల్లోకి నెట్టి తనకు నచ్చిన వారికి, నచ్చిన రేటుకు అమ్మేసేవారని సీఎం జగన్ పేర్కొన్నారు. వాటిల్లో పని చేసే వేలాది మంది కార్మికుల ఉద్యోగాలను బలి తీసుకున్నది ఈ పెద్ద మనిషి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఉద్యోగులు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా ఎగనామం పెట్టారని దుయ్యబటారు. ఈ పరిశ్రమలను దేవెందర్ గౌడ్, నామా నాగేశ్వరరావుకు అమ్మేశారని, అంతా తన చుట్టూ ఉన్న వారే కనిపిస్తారని, పప్పు బెల్లాలకే పరిశ్రమలను అమ్మేశారని సీఎం దుమ్మెత్తిపోశారు.
చంద్రబాబు హయాంలో అక్షరాల 54 సంస్థలు ముసివేశారని లేదా అమ్మేశారని ఈయన 2004లో పోకపోయి ఉంటే ఆర్టీసీ, ఆసుపత్రులు, స్కూళ్లు అన్నీ కూడా హోల్‌షేల్‌గా అమ్మేసేవాడని ధ్వజమెత్తారు.
చంద్రబాబు తన మాదిరిగానే మేనిఫెస్టోను కూడా ప్రజలు మరచిపోతారని అనుకుంటున్నారని, తన సొంత మామను అధికారం కోసం వెన్నుపోటు పొడవడం కూడా ఈ తరానికి తెలియదు అన్నది చంద్రబాబు నమ్మకమని ఆ వెన్నుపోటులో కూడా మద్దతుగా నిలిచిన ఈనాడు రామోజీ రావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పాత్ర ఎవరికి గుర్తు ఉండదని చంద్రబాబు భ్రమ పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా మూడుసార్లు అధికారంలోకి వచ్చి మోసం చేశాడని, దత్త పుత్రుడిని కూడా ఏ ఎన్నికల్లో ఎప్పుడు ఎందుకు జనం మీదికి వదులుతాడో చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు.
*వెల్లూరు మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీ*
వెల్లూరు మెడికల్ కాలేజీ 18 ఏళ్ల తరువాత నేడు మళ్లీ శ్రీకారం చుడుతున్నామని సీఎం హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అగ్రగామీ మెడికల్ కాలేజీ మన చిత్తూరుకు వస్తుంటే అడ్డుకున్నది సాక్ష్యాత్తు ఈ చంద్రబాబు, గజ దొంగల సభ్యుడు ఈనాడు రామోజీ వియ్యంకుడిదే అడ్డుకున్న చరిత్రని సీఎం మండిపడ్డారు. ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం మీ బిడ్డదని ఉద్ఘాటించారు.
*ఒకరు వెన్నుపోటు వీరుడు.. మరొకరు ప్యాకేజీ సూరీడు*
చక్రాలు లేని సైకిల్‌ను నడపలేని నాయకుడు ఒకరైతే.. ఎవరైనా తైలం పోస్తే కానీ గ్లాస్ నిండని వ్యక్తి మరో నాయకుడని సీఎం జగన్ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఒకరు వెన్నుపోటు వీరుడని, మరొకరు ప్యాకేజీ సూరుడని ఎద్దేవా చేశారు. వీరిద్దరికి కూడా పేదల బతుకులు, కష్టాల గురించి, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలన్నది కూడా వీరికి తెలియదని, ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014 నుంచి 2019 వరకు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ఏలారని విమర్శించారు.
ఈ ఇద్దరు కలిసి రైతులను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చిన్న పిల్లలను, సామాజిక వర్గాలను వెన్నుపోటు పొడిచారని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. వీరికి డీబీటీ చేయడం చేతకాదని, వీరికి తెలిసిందల్లా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం అని మండిపడ్డారు
Comments are closed.