south9 ప్రతినిధి :
చైనా ప్రస్తుతం రెండు సంక్షోభాలను ఎదుర్కొంటుంది ఓవైపు జననాల సంతాన ఉత్పత్తి రేట్లు తగ్గిపోతుండగా మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది ఆ దేశ జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది జననాల సంఖ్య 2023లో 20 లక్షలు తగ్గినట్టు తెలుస్తోంది ఈ ప్రభావం ఇప్పుడు విద్య పాటు పలు రంగాలపై పడుతున్నట్టు సమాచారం పిల్లలు లేక దేశవ్యాప్తంగా వేలాది స్కూల్స్ మూత పడుతున్నాయి గత ఏడాది వేలసంఖ్యలో కిండర్ గార్డెన్లో మూత వేసినట్టు చైనా విద్యాశాఖ కాజా నివేదిక వెల్లడించింది 5645ప్రాథమిక పాఠశాలలు కూడా మూతపడ్డాయి.గతేడాది చైనా వ్యాప్తంగా 90లక్షల జననాలు మాత్రమే జరిగాయి. 1949 తర్వాత అత్యంత తక్కువ జననాలు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.