తేదీ: 21-09-2021,
అమరావతి.
మంగళవారం ఉదయం వాణిజ్య ఉత్సవం-2021ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు వాణిజ్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవం
వాణిజ్య ఉత్సవం- 2021కు హాజరైన దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు,పారిశ్రామికవేత్తలు
ఎక్స్ పోర్ట్స్ కార్నివాల్ లో పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలో ఎక్కువగా ఎగుమతి అయ్యే వస్తువులను ప్రదర్శనలో తిలకిస్తూ వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న సీఎం
వాణిజ్య ఉత్సవంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,పేర్ని వెంకట్రామయ్య, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్,వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, హిందూపురం ఎంపీ, విజయవాడ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరవింద్ గోయెంక, కియా సంస్థ ప్రతినిధి డోంగ్ లి, తదితరులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికత, ప్రజలకు మంచి చేయాలనే తపనను మెచ్చుకున్న సెయింట్ వ్యవస్థాపకులు పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఎగుమతుల సదస్సు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ పారిశ్రామికాభివృద్ధి దిశగా వేస్తున్న అడుగుల గురించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆడియో,వీడియో ప్రదర్శన
Comments are closed.