*విద్యాభివృద్దికి రూ.లక్ష కోట్లు అందచేసిన ముఖ్యమంత్రి జగనన్న*
*:ఏడీఎఫ్ ద్వారా డిజిటల్ క్లాస్ రూంలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి*
*రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో విద్యాభివృద్ది కోసం వివిధ పథకాల ద్వారా రూ.లక్ష కోట్లు అందచేశారని, అలాంటి ముఖ్యమంత్రి బాటలో నడుస్తూ ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా దాతల సహాయ సహకారాలతో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేస్తూ విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*శనివారం మండల కేంద్రమైన అనంతసాగరంలోని టిజెయన్ ఉన్నత పాఠశాలలో ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా చింతగుంట చెన్నారెడ్డి, రాజమ్మ దంపతుల గౌరవారం వారి కుమారుడు చింతగుంట సుబ్బారెడ్డి, అనితల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను ఆయన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలసి లాంఛనంగా ప్రారంభించారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటి ప్రపంచంలో విద్యార్థులకు మరింత అర్థమయ్యే రీతిలో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఏడీఎఫ్ ద్వారా ఆమెరికాలో నివాసముంటున్న చింతగుంట సుబ్బారెడ్డి, అనితలు అందచేయడం జరిగిందని అన్నారు.*
*ఆత్మకూరు నియోజకవర్గంలో 100 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. డిజిటలైజేషన్ అనంతరం ఇక్కడి ఉపాధ్యాయులకు సీడ్స్ స్వచ్చంధ సంస్థ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలకు మనమిచ్చే విలువైన ఆస్తి విద్య అనే మాటకు కట్టుబడి ఇప్పటి వరకు రూ.లక్ష కోట్లు వరకు వెచ్చించారని అన్నారు.*
*నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరు ముద్దు, విద్యాకానుక కిట్లు ఇలా అన్ని అందచేస్తూ వారి విద్యాభివృద్దికి కృషి చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న విద్యాభివృద్దికి తోడుగా ఒక శాసనసభ్యునిగా తాను సైతం ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా ఇలా ఒక్కొ పాఠశాలలో రెండు డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.*
*నియోజకవర్గంలో పుట్టి ఉన్నత విద్య అభ్యసించి వేర్వేరు దేశాల్లో ఉంటున్న వారు ఈ ప్రాంతాలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఏడీఎఫ్ ద్వారా ఇప్పటి వరకు 16 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.*
*లక్ష్యం మేరకు పాఠశాలల్లో డిజిటల క్లాస్ రూంలను ఏర్పాటు చేసి విద్యాభివృద్దికి కృషి చేస్తానని, దీని కోసం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వివరించారు*
Comments are closed.