అమరావతి: ఏపీలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు జూన్ 30తో ముగియనుండడంతోటి జూలై 1 నుంచి కొన్ని సడలింపు లను ఇచ్చింది ప్రభుత్వం. ఆంధ్రాలోశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాజిటివ్ రేటు 5% తక్కువ ఉన్నందున జూలై 1 నుండి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాపార లావాదేవీలకు అనుమతులు ఇచ్చారు. రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు కర్ఫ్యూ కఠినతరం గా ఉంటుందని అధికారులు తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలానే పాజిటివ్ రేటు 5% కన్నా ఎక్కువ ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో యధాతధంగా పాత నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలియజేశారు.
Comments are closed.