తేదీ: 28-08-2023*
*స్థలం: నగరి*
*8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.680.44 కోట్ల `జగనన్న విద్యా దీవెన` నిధులు*
*చంద్రబాబుకు సొంత బలం, సొంత కొడుకుపై నమ్మకం లేకనే తెరపైకి ప్యాకేజి స్టార్.. సీఎం జగన్*
జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్రంలోని 2022- 23 విద్యా సంవత్సరంలో మూడవ త్రైమాసికానికి (ఏప్రిల్23- జూన్23) చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని అర్హులైన 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 8,44,336 మంది తల్లుల ఖాతాల్లో రూ. 680.44 కోట్లను చిత్తూరు జిల్లా నగరి వేదికగా సీఎం జగన్ జమ చేశారు. అదే విధంగా నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ. 15,593 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇచ్చిన మాట తప్పడం, మడమ తిప్పడం ఎన్నటికీ జరగదని, చంద్రబాబులా కుట్ర రాజకీయాలు చేయమని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల అనంతరం మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుదని, ఎన్నికల మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత మాదని సీఎం జగన్ పేర్కొన్నారు.
*విద్యార్ధుల భవిష్యత్తు మార్చేలా చదువుల విప్లవం*
పేదరికాన్ని నిర్నూలించగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉందని, ఈ నాలుగేళ్లలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పిల్లల చదువు పై దృష్టి పెట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. స్కూళ్లలో ఆడిపిల్లల కోసం స్వేచ్ఛ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని, నాడు- నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చివేస్తున్నామని, పిల్లలకు విద్యా కానుకనిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ విద్యా దీవెన ద్వారా కాలేజీ యాజమన్యాన్ని ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి పేద కుటుంబ భవిష్యత్తు బాగుండాలనే కార్యక్రమాలు చేస్తున్నామని, ఇక పై తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం అప్పలుపాలు అవ్వదని, వారి పిల్లల విద్యా భావిష్యత్తు నేను తొడు ఉంటా అని సీఎం జగన్ హామి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు , ఐటీఐ వంటి సంస్థల్లో చదువుకోవడానికి ఆ సంస్థలు వసూలు చేస్తున్న ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోందని, కాలేజీల ఫీజును కూడా చెల్లిస్తోందని సీఎం పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు.. భోజన, వసతి ఖర్చులను కూడా ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కింద చెల్లిస్తోందని, వీటిని ప్రతీ సంవత్సరం రెండు విడతలుగా ఇస్తోందని అన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదివే వారికి రూ.20 వేల చొప్పున ఇస్తోందని చెప్పారు.
*అధికారం కోసం అబద్ధాలే కాదు అడ్డమైన గడ్డి తినడానికి కూడా వెనకాడని చంద్రబాబు*
“మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ఆ పెద్దమనిషి పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తువస్తుందా, ఒక్క వాగ్థానైనా నిలబెట్టున్నారా, అధికారం కోసం గడ్డి తినటానికి కూడా వెనకాడరు ఈ పెద్ద మనిషికి సొంత బలం మీద కానీ, సొంత కొడుకు మీద నమ్మకం లేక ప్యాకేజీ స్టార్ ని తీసుకువచ్చారు”- సీఎం జగన్
చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాల మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందని,ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, గొడవలు సృష్టించి శవరాజకీయాలు చేసే విధంగా, కుట్రపూరితంగా, వీరి మాటలు ఉంటున్నాయని సీఎం దుయ్యబట్టారు. చెప్పుకొవటానికి ఏ మంచి లేక వీరందరు ఆధారపడేది అబద్ధాల మీద, కుట్రల మీదేనని సీఎం ఎద్దేవా చేసారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసుల మీద దాడి చేశారని గుర్తి చేశారు. కావాలనే పోలీసుల పై రాళ్లు రువ్వించారని, బీరు బాటీళ్లతో కొట్టించారని ఇది చాలా బాధ అనిపిస్తోందని సీఎం అన్నారు.
“ఎన్నికల కమిషన్ కు కంప్లెంట్ ఇవ్వటానికి ఈ మనిషి ఢిల్లీకి వెళ్లారు. ఈ రాష్ట్రంలో తన మీద పోలీసులు హత్యాయత్నం చేశారంట.. వారు సృష్టించిన దొంగ ఒట్ల గూర్చి వారే కంప్లెంట్ ఇస్తారంట.. అబద్ధాలు మాత్రమే చెప్పే చంద్రబాబుకు, మీ బిడ్డకు మధ్య తేడా చూడండి”- సీఎం జగన్.
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పోడిచిన ఈ బాబు నేడు ఎన్టీఆర్ కి దండ వేసి దండం పెడుతున్నారని, ఎన్నికల కోసం ముందు స్వర్గాన్ని చూపిస్తాడని తర్వాత ప్రజలు నరకం చూపిస్తాడని సీఎం జగన్ విమర్శించారు. అప్పటికి, ఇప్పటికి రాష్ట్రానికి ఇదే బడ్జెట్ అని.. మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమేనని, ప్రజలు తేడా గమనించాలని సీఎం కోరారు.
Comments are closed.