అమరావతి: టీడీపీ నేతలపై ఏసీబీ, నిర్భయ కేసులు అయిపోయాయని ఇప్పుడు హత్యకేసుల్లోనూ ఇరికించాలని చూస్తున్నారా అంటూ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు ప్రశ్నించారు.
మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా కొల్లు రవీంద్ర పేరు చేర్చడంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం అక్రమ కేసులను పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని అన్నారు.
ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయి. ఇప్పుడిక తెలుగుదేశం నేతలపై హత్య కేసులు పెడుతున్నారు. పైగా బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు?(1/5)#AnotherBCLeaderHarassedByYCP#WeStandWithKolluRavindra pic.twitter.com/tOD4zA1H9b
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 3, 2020
Comments are closed.